వైరల్ : మానవత్వం చచ్చిపోయింది.. ఇప్పుడు ఇది లోకం తీరు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాలు వ్యవధిలోనె ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇక ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలుసుకున్న తర్వాత నేటి సభ్య సమాజంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయింది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే సాటి మనిషికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా అయ్యో పాపం అని జాలి పడిన మనిషి.. ఇక ఎప్పుడూ సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు అని తెలిసిన సహాయం చేసేందుకు ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది.

 సహాయం చేయకపోగా ఇక చేతిలో ఉన్న మొబైల్ తో తమ ముందు ఏదో విడ్డూరం జరుగుతున్నట్లుగా అంతా చిత్రీకరిస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇక్కడ ఇటీవల మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 70 ఏళ్ల వ్యక్తి చనిపోయిన భార్యను అంబులెన్స్ లో తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఇక భుజంపై భార్య మృతదేహాన్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు   అయితే పక్కనే ఉన్న వాళ్ళు అతనికి సహాయం చేయకపోగా ఫోన్లో ఇదంతా వీడియో తీశారు అని చెప్పాలి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్ లో వెలుగు చూసింది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. బిజెపి నేతలు ఈ వీడియోని ట్విటర్లో షేర్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధించారు  అని చెప్పాలి. కృష్ణదేవన్ అనే 70 ఏళ్ల వృద్ధుడి  భార్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. అయితే అంబులెన్స్ మాట్లాడి తీసుకురమ్మని తన కుమారుడు రాంప్రసాద్ ను పంపాడు. అయితే 3000 ఇస్తే గాని ఆంబులెన్స్ రాదని చెప్పడంతో అంత డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న కృష్ణదేవన్ ఇక తన భార్యా మృతదేహాన్ని భుజానా వేసుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళాడు.. తాము నడుచుకుంటూ వెళుతున్న సమయం ఎంతో మంది వీడియోలు తీసారని అయితే వారిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయలేదని వాపోయాడు కృష్ణదేవన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: