వైరల్ : నిద్రపోతున్న సింహాన్ని లేపిన గేదెలు.. చివరికి?
సింహంతో పోల్చి చూస్తే భారీ ఆకారం కలిగిన ఏనుగులు, గేదెలు సైతం సింహం పంజాకి భయపడుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ అలాంటి సింహమే బలహీనంగా మారితే అప్పటివరకు ఆ సింహాన్ని చూసిన భయపడిన మిగతా జంతువులని సింహం పై దాడి చేయడానికి దూసుకు వస్తూ ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు నాకంటే తోపులెవరూ లేరు అనుకునే సింహం వయసు మళ్లిన తర్వాత ఎలాంటి దినస్థితిని ఎదుర్కొంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో మారుతుంది.
ఇక ఇటీవల వైరల్ గా మారి పోయిన వీడియో లో చూసుకుంటే ఒక ముసలి సింహం అడవిలో సేద తీరుతుంది. అదే సమయం లో అక్కడికి బర్రెల గుంపు వచ్చింది. అయితే సాధారణం గా అయితే సింహం అలా గేదెలు దగ్గరికి వచ్చిన సమయం లో ఒక్క సారిగా గాండ్రించి భయపెడుతుంది. కానీ ఆ సింహం ముసలిది కావడం తో ఏం చేయలేకపోయింది. దీంతో నిద్రపోతున్న సింహాన్ని లేపినప్పటికీ ఆ సింహం ఏమి చేయలేకపోయింది. ఇక గేదెల గుంపు కొమ్ములతో ఆ సింహాన్ని గాల్లోకి ఎగరవేయడం మొదలుపెట్టాయి. ఆ గేదెల గుంపును ఎదుర్కోవడం ఆ సింహం వల్ల కాలేదు. దీంతో చెట్ల పొదల్లో దాక్కుంది ఆ సింహం.