ఆమెకు 19, అతనికి 70.. ఇద్దరి మధ్య ప్రేమ.. ఎలా పుట్టిందో తెలుసా?

praveen
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అంటూ ఉంటారు ఎంతోమంది. కానీ కొంతమంది పెళ్లిళ్లు చూసిన తర్వాత మాత్రం ఇలాంటి పెళ్లిళ్లు కూడా స్వర్గంలోనే నిర్ణయించబడతాయ అని అనుమానం ప్రతి ఒక్కరి మనసులో కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్లి చేసుకోవడానికి ఈడు జోడు చూసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక తమకు సరిపడా ఈడు జోడు కలిగిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఊహించని నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఇంకా నిండా 20 ఏళ్లు కూడా నిన్ననే 19 ఏళ్ల యువతీ 70 ఏళ్ల వ్యక్తికి మనవాడెందుకు సిద్ధమైంది.

 ఇక ఈ వివాహం చూసిన తర్వాత ఇలాంటి పెళ్లిళ్లు కూడా స్వర్గంలోనే నిర్ణయించబడతాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. లిఖిత్ అలీ అనే 70 ఏళ్ల వ్యక్తి లాహోర్లోని ఓ పార్కుకు మార్నింగ్ వాక్ వెళ్తూ ఉండేవాడు. అక్కడికి గమైలా అనే 19 యువతి కూడా వస్తుంది. అనుకోకుండా ఓ రోజు సినిమా లెవెల్ లో జరిగిన ఓ సన్నివేశం వీరిద్దరి మనసులను కలిపింది. యువతి ముందు నడుస్తుండగా వెనకాల లిఖిత్ అలీ ఓ పాటను హమ్ చేస్తూ వస్తున్నాడు. మ్యూజిక్ అంటే చెవి కోసుకునే గమైలా  లిఖిత్ పాటకు ఫిదా అయింది.. దీంతో వీరి మనసులు కలిసాయి. ఇక వీరిద్దరి ప్రేమ వయసు బేధాలను పక్కన పెట్టేసింది.

 ఇక ఇటీవల  ఎలా ప్రేమలో పడ్డారు అని సదరు యువతిని  ప్రశ్నించగా అలా జరిగిపోయింది అంటూ సిగ్గు పడింది. మరి మీ పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా అంటూ ప్రశ్నిస్తే ముందు ఒప్పుకోలేదు. వయసులో అంత తేడా ఉన్న వ్యక్తిని పెల్లాడటం ఏంటి.. వద్దు అన్నారు. కానీ నేను లిఖిత్  ఎలాగోలా ఒప్పించగలిగామూ అంటూ కొత్త పెళ్లికూతురు బదులు ఇచ్చింది అని చెప్పాలి. ఇక వయసులో భారీ తేడాలతో పెళ్లి చేసుకున్న వారిని దయచేసి నిందించవద్దు అంటూ సభ్య సమాజాన్ని కోరింది సదరు యువతి. చెడు తిరుగుళ్ళు తిరిగే బదులు మనసుకు నచ్చిన వాడితో మనువు జరిగితే అంతకంటే ఇంకేం కావాలి అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: