వైరల్ : ఇలాంటివి అవసరమా.. తోటకు వెళ్లి లవర్స్ ఏం చేశారో చూడండి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతు ఉన్నాయని చెప్పాలి. ఇందులో కొన్ని వీడియోలు అందరిని అవకాకాయ్యేలా చేస్తూ ఉంటాయ్. ఎందుకంటే సభ్య సమాజంలో విద్యార్థులు ఎలా ఉన్నారు అన్నదానికి కొన్ని వీడియోలు నిదర్శనం గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇటీవల చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీలకు స్కూళ్లకు పంపిస్తూ ఉంటే అటు విద్యార్థులు మాత్రం చెడు తోవలో వెళ్తు చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్నవయసులోనే ప్రేమ దోమ అంటూ చెడుతిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఏకంగా ఒక అబ్బాయి కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణ రహితంగా కొట్టుకున్న వీడియోలు అందరినీ అవక్కయ్యేలా చేసాయి. ఇక ఇలాంటి తరహా వీడియోలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే ఏకంగా చదువుకోమని పంపించిన ఓ యువతి యువకుడు ఎవరికీ కనిపించకుండా ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. ఈ క్రమంలోనే తనకోసం అక్కడికి వచ్చిన ప్రియురాలు పై సరదా తీర్చుకున్నాడు యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక అబ్బాయి తన స్నేహితురాలని అరటి తోటకు పిలుస్తాడు. ఇక ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ లోనే తోటకు వస్తుంది. అయితే ఇక ఇద్దరు ప్రేమికుల తో పాటు మరో యువకుడు కూడా అక్కడ ఉంటాడు. అక్కడ జరుగుతుందంతా వీడియో తీస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సదరు వ్యక్తి కుంకుమ బరిని పట్టుకుని ఉంటాడు. అయితే అబ్బాయి కుంకుమ భరణిలోని సింధూరం తీసి అమ్మాయి నుదటన  పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయి వద్దంటూ నిరాకరిస్తుంది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత ఇక ప్రియురాలు నుదుటి పై సింధూరం దిద్దుతాడు సదరు వ్యక్తి.. ఇలా ఒకరకంగా పెళ్లి జరిగిపోయింది అన్నట్లుగా సదరు అమ్మాయికి ఇండైరెక్టుగా మెసేజ్ ఇస్తాడు. దీంతో అమ్మాయి సిగ్గుపడుతుంది.ఇది చూస్తున్న నెటిజన్లు చదువుకోమని పంపిస్తే ఇలాంటి పనులు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: