
మరో మరణం.. అందరిలో భయం భయం?
ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయ్. ఇటీవలే ఒక జిమ్ ట్రేైనర్ ఏకంగా ఒక కుర్చీలో కూర్చుని ఇక సెకండ్ల కాలంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కు సంబంధించిన వీడియో ఎంత వైరల్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ఘటన గురించి అందరూ మర్చిపోయే లోపే ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా పంటి నొప్పి కారణంగా ఒక్క ఆసుపత్రికి వచ్చిన వ్యాపారి పేపర్ చదువుతూ కేవలం సెకండ్ల వ్యవధిలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతనికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
గుజరాత్ లోని సూరత్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వస్త్ర వ్యాపారి దిలీప్ కుమార్ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల నాలుగవ తేదీన బాడ్మీర్ కు వచ్చారు. అయితే పంటి నొప్పి ఉండడంతో ఇటీవల వైద్యుడిని కలిసినందుకు వెళ్లారు ఆయన. ఇక వైద్యుడు కలవడానికి ముందు పక్కనే వెయిటింగ్ హాల్లో కూర్చుని హాయిగా పేపర్ చదువుతూ ఉన్నాడు. కానీ అంతలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. అయితే వెంటనే వైద్యులు అతనికి చికిత్స అందించినప్పటికీ కూడా అతని ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది. ఇలాంటి ఘటనలు అందరిలో ప్రాణ తీపిని పెంచుతూ భయం భయంగా బ్రతికే పరిస్థితిని తీసుకు వస్తున్నాయి.