నీ దైర్యం ఏంటి భయ్యా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్?
పెద్ద పెద్ద నీటి కోలనులలో ఉండే మొసలి ఇక అక్కడికి దప్పిక తీర్చుకోవడానికి వచ్చిన ఎన్నో జంతువుల పీక పట్టి నీళ్లలోకి లాగి దారుణంగా చంపేస్తూ ఉంటాయి అని చెప్పాలి ఇక ఇక ఎప్పుడైనా ఇలా నీళ్ల దగ్గరికి మనిషి వెళ్ళాడు అంటే చాలు దారుణంగా నీళ్లలోకి లాగేసి ప్రాణాలు తీస్తూ ఉంటాయి. అందుకే మొసలి ఎక్కడైనా కనిపించింది అంటే చాలు భయపడిపోతూ ఉంటారు అందరూ. పొరపాటున మనుషులు మరిచిపోయి మొసలి దగ్గరికి వెళ్లారు అంటే చాలు ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా కనిపిస్తున్న భారీ మొసలితో ఒక వ్యక్తి ఆడుకుంటున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక వ్యక్తి ఒక పెద్ద ముసలి ముందు నిలబడి దానికి ముద్దు చేస్తున్నాడు అంతేకాదు దానికి దగ్గరగా తలపెట్టి ఏకంగా ఆహారాన్ని కూడా అందిస్తున్నాడు. ఇక అతను చెప్పినట్లుగానే మొసలి చేస్తూ నోరు తెరవడం నోరు మూసేయడం కూడా చేస్తూ ఉంది. అంతేకాదు సదరు వ్యక్తి మొసలి నోటిపై ప్రేమతో నిమురుతూ ఏకంగా సొంత పిల్లాడిని చూసుకున్నట్లుగా లాలించాడు అని చెప్పాలి. ఇది చూసి అతని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్స్ .