వార్నీ.. ఇలా కూడా డిజిటల్ పేమెంట్ చేస్తారా?
ఇక నేటి రోజుల్లో గల్లీలో ఉండే చిన్న బడ్డీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా ఎక్కడపడితే అక్కడ ఫోన్ పే గూగుల్ పే స్కానర్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో అయితే క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. ఇలా ఎక్కడ చూసినా నగదు రహిత ఇక లావాదేవీలే జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక మాల్ కు వెళ్ళిన ఒక వ్యక్తి డిజిటల్ పేమెంట్ చేసిన విధానం మాత్రం సోషల్ మీడియాలో అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
ఇక ఇది చూస్తున్న నెటిజెన్లను మాత్రమే కాదు అక్కడ ఉన్న షాప్ యజమానిని సైతం బెత్తర పోయేలా చేసింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి షాపింగ్ చేసేందుకు మాల్ కూ వస్తాడు తనకు కావలసిన వస్తువులు తీసుకున్న తర్వాత యజమానిని ఆటపట్టించాలని ప్రయత్నం చేస్తాడు. తన డెబిట్ కార్డును మాస్క్ లో దాచిపెట్టి వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత కార్డుతో చెల్లించేందుకు మిషన్ తీసుకున్నాడు. తర్వాత ఒక వ్యక్తి నుదుటి వద్ద కాస్త సమయం ఉంచుతాడు. అంతే వెంటనే మెషిన్ పేమెంట్ చేసినట్లు స్లిప్ వస్తుంది. దాన్ని చూసిన యజమాని బిత్తిరి పోయాడు. ఇది ఎలా సాధ్యమైంది అన్నది అతనికి అర్థం కాలేదు. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు