పెట్రోల్ పోసుకొని.. పట్టించుకోబోయిన భార్యాభర్తలు.. కానీ అంతలో?
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆర్కే పురం లోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంటికి వెళ్లి దాన్ని కూల్చి వేయడానికి ప్రయత్నించారు. బుల్డోజర్లను కూడా అక్కడికి రప్పించారు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఉన్న దంపతులను బయటికి వచ్చి అనూహ్యమైన ప్రవర్తనతో అందరిని షాక్ అయ్యేలా చేశారు. ఇంటిని కూల్చోద్దని బెదిరించారు. అయినప్పటికీ అధికారులు వినిపించుకోకపోవడంతో ఇంటి బయట గోడ వద్ద ఉన్న దంపతులు శరీరాలపై పెట్రోల్ పోసుకున్నారు. ఈ క్రమంలోనే వినని అధికారులు ఇంట్లోనే కొంత భాగాన్ని కూల్చేశారు. దీంతో దంపతులు నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. ఇది చూసిన అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. వెంటనే వారిని పైకి లాగే నీళ్లు చల్లి వారి ప్రాణాలను కాపాడారు.
అయితే పోలీస్ అధికారులు ముందే అగ్నిమాపక సిబ్బందితో కలిసి రావడంతో ఇక అక్కడ జరగబోయే ప్రమాదాన్ని అడ్డుకోవడం ఎంతో సులభం తరం అయింది అని చెప్పాలి. కాగా ఇలా పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకునేందుకు ప్రయత్నించిన దంపతులు సోనా సేన్,సునీల్ సింగ్ గా తేల్చారు అధికారులు. ఇటీవల కురిసిన వర్షాలకు జనవాసాల్లోకి నీరు వచ్చాయి. కాగా నిలువ ఉండే ప్రాంతంలో ఆక్రమ కట్టడాలు నిర్మించిన వారిని హెచ్చరిస్తూ కట్టడాలను కూల్చివేస్తున్నారు మున్సిపల్ అధికారులు.ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తోంది.ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.