మూన్‌వాక్ ను అదరగొట్టిన యువతి..వీడియో వైరల్..

Satvika
ఈ మధ్య కాలంలో డ్యాన్స్ ను ఎక్కువ మంది చేస్తున్నారు. అందులో కొందరు చేసే డ్యాన్స్ ఔరా అనిపిస్తుంది.నెట్టింట డ్యాన్స్ వీడియోలు లెక్క లెనన్ని దర్శనమిస్తాయి.అందులో డ్యాన్స్ కు సంబందించిన వీడియోలు కూడా కొన్ని వుంటాయి..ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఓ యువతి డ్యాన్స్ కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు.అ డ్యాన్స్ మూన్‌వాక్..చాలా సులువుగా అందరినీ మెప్పించింది.

ఈ డ్యాన్స్ పేరు వినగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మైకేల్ జాక్సన్..మూన్‌వాక్ డ్యాన్స్‌ సూపర్ పాపులర్ అయింది. ఈ డ్యాన్స్ చూసేందుకు ఒక అద్భుతమైన మ్యాజిక్‌లా అనిపిస్తుంది. అందుకే, ఈ డ్యాన్స్ మూవ్‌ ఎప్పుడూ వీక్షకులను అబ్బురపరుస్తూ ఉంటుంది.కాగా.. ఈ డ్యాన్స్ నేర్చుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. అయితే ఇది ఎలా చేయాలో తెలుసుకుంటే.. ఎవరైనా సరే దీనిని ఈజీగా చేయగలరని ఒక యువతి చెబుతోంది. అంతేకాదు, ఇది ఎలా చేయాలో ఆమె చాలా సింపుల్ స్టెప్స్ లో చూపించింది. కాగా ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. @fastworkers6 అనే ట్విట్టర్ పేజీ దీనిని షేర్ చేసింది. షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే కోటి 20 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.ఇప్పుడు ఇదే ట్రెండ్ లో ఉండటం విశేషం..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో మనకు ముందుగా ఒక యువతి షూస్ వేసుకొని ఒక రోడ్డుపై నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె మూన్‌వాక్ చేసేందుకు ముందుగా కాళ్లను ఏ పొజిషన్‌లో పెట్టాలో చూపిస్తుంది. ఆపై మూన్‌వాక్ చేస్తూ వెనక్కి వెళుతూ ఉంటుంది. అయితే ఆమెతో పాటు వచ్చిన కొంతమంది యువకులు కూడా ఈ స్టెప్ వేస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేశారు.దీన్ని చూసిన నెటిజన్లు ఇది చాలా ఈజీ గా చేసే లా అనిపిస్తోంది అని కామెంట్ చేస్తున్నారు. అయితే మూన్ వాక్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ మాత్రమే ముందుకు వెళ్తున్న భ్రాంతి కలగాలని కానీ ఈ యువతి చేస్తున్నప్పుడు అలాంటి భ్రాంతి కలగడం లేదని ఒక యువర్ కామెంట్ చేశాడు. దీన్ని ట్రై చేసేందుకు మేము సిద్ధమయ్యాం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు..మీరు ఈ వీడియో ను ఓ సారి చూసేయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: