కండోమ్ చేతిలో పట్టుకుని.. యువతి లైవ్ రిపోర్టింగ్?

praveen
సాధారణం గా భారత్లో కండోమ్ అనే పదాన్ని బూతుగా భావిస్తూ ఉంటారు. అధునాతన జీవన శైలిలో అడుగు పెడుతున్న మనుషులు ఇంకా కొన్ని విషయా లలో మాత్రం చిన్న చూపుతోనే ఆలోచిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయని చెప్పాలి. అయితే సాధారణం గా కండోమ్ పేరు తీయడానికి ఎంతో మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ  ఉంటే.. ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా కండోమ్ చేతి లో పట్టుకుని రిపోర్టింగ్ చేయడం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చెక్కలు కొడుతుంది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికా లోని ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక భారీ వర్షం నేపథ్యం లో అక్కడి ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమయం అయిపోయాయి. ఇక జనావాసాల్లోకి నీరు రావడం తో పూర్తిగా పరిస్థితి అస్తవ్యస్తం గా మారి పోయింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఈ క్రమం లోనే వాహనదారుడు రోడ్డు మీదికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

 ఇక తుఫాన్ ప్రభావానికి 60 మందికి పైగా ప్రజలు చని పోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమం లోనే అక్కడ ప్రజలు భారీ వర్షాల కారణం గా ఎదుర్కొంటున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు వర్షం
లోనే లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. కాగా కైలాగేలర్ అనే యువతి వర్షంలో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో మైక్ తడవకుండా ఉండేందుకు కండోమ్ తొడిగించింది.  ఇక ఇలా కండోమ్ని మైక్ కి తొడిగి అది చేతిలో పట్టుకొని మరి రిపోర్టింగ్ చేయడం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: