దేవుడా..ఇది చూస్తే ఇక జన్మలో టీ తాగరు..

Satvika
పొద్దున్నే లేవగానే టీ, కాఫీ తాగితే గానీ పొద్దు గడవదు..అసలు సంతృప్తి వుండదు.. ఇంకొందరైతే బెడ్‌ కాఫీ, టీ అని తాగుతుంటారు. అలా రోజును ప్రారంభించబోతున్నా, మధ్యాహ్నం పని సమయాలకు మధ్యలో కప్పు టీ తాగడం అలవాటు..చాయ్ అనేది మనస్సును శక్తివంతం చేసే రిఫ్రెష్ పానీయం. అలాంటి చాయ్‌లో అనేక రకాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. టీకి సంబంధించి ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.

కొందరు రూహ్ అఫ్జాతో టీ తయారు చేస్తుంటే, మరికొందరు అరటిపండు, చీకూతో టీ తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు టీ తో జరిగిన ఓ దారుణాన్ని నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల ఆగ్రహం ఆకాశానికి చేరింది. నిజానికి, ఒక చాయ్‌వాలా సోదరుడు డ్రాగన్ ఫ్రూట్ నుండి టీ తయారు చేసాడు. వీడియో రెసిపీని చూసిన నెటిజన్లు కోపం తో మండిపోతున్నారు. అందులో కాస్త ఇంకేదైనా పెట్టండ్రా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు నెటిజన్లు..

అల్లం, యాలకులు, మసాలా టీ ఎక్కువగా తాగే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్‌తో తయారు చేసిన టీని తాగారా..? మీరు తాగకపోతే, గనుక ఇప్పుడు ఇక్కడ ఆ కొత్త రకం టీని ఎలా తయారు చేస్తారో చూడండి. వైరల్ అవుతున్న వీడియోలో ఒక చాయ్‌ విక్రయించే వ్యక్తి ఒక కప్పులో వేడి టీ పోస్తున్నాడు. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును తీసి దానిని ఒక కప్పు టీలో కలుపుతాడు. తర్వాత ఒక చెంచా కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలిపి ప్రజలకు అందించాడు. ఈ వీడియో బంగ్లాదేశ్ నుండి షేర్‌ చేయబడినదిగా చెబుతున్నారు.. ఈ వీడియోలో ఆ వ్యక్తి డ్రాగన్ ఫ్రూట్ పల్ప్‌తో పాల టీని తయారు చేస్తుండటం నెటిజన్లు అవాక్కయ్యేలా చేసింది.మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: