రూ.1 కే కార్పొరేట్ వైద్యం..భోజనం కూడా ఫ్రీ..ఎక్కడంటే?

Satvika
ఏదైనా రోగాలు వచ్చాయంటే జనాలు భయంతో వణికి పోతున్నారు.. కొన్ని రోగాలకు ఆసుపత్రులకు వెళితే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది.. తలనొప్పి, జలుబు అని ఆసుపత్రికి పోతే టోకెన్ ఫీజు 300 ఉంటుంది. ప్రభుత్వ దావఖాన లో వైద్యం అటకెక్కిందని అందరికి తెలుసు.. ఇక చేసేదేమి లేక ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. 


సంబంధిత పరీక్షలు, మెడిసిన్‌ వెరసి రూ. వేలల్లో సమర్పించుకోవాల్సిందే. అయితే కేవలం ఒక్క రూపాయి కన్సల్టేషన్‌ ఫీజుతో కార్పొరేట్‌ వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది.? డీఎస్‌ఆర్‌ అండ్‌ డీవీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యం తో ఏర్పాటు చేసిన జీజీ చారిటీ హాస్పిటల్‌ పేదలకు తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందిస్తోంది..ఈ ఆసుపత్రి మన హైదరాబాద్ లోనే ఉంది.. రాంగనగర్‌ లో 2022 ఫిబ్రవరి లో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. కన్సల్టేషన్‌ ఫీజుగా కేవలం రూపాయి మాత్రమే తీసుకోవడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఆ ఒక్క రూపాయిని కూడా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హుండీలో వేయాల్సి ఉంటుంది. 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తారు.


గర్భిణులు, పిల్లలు, ఆర్థో సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రి లో 18 వైద్యులు ఉన్నారు. కేవలం కన్సల్టెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా ల్యాబ్‌, ఎక్స్‌రే, ఫిజియో థెరపీ, ఐసీయూ, అల్ట్రాసౌండ్‌ లాంటి పరీక్షల ను కూడా తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు. అలాగే.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల కు ఉచితంగా భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ఆయూష్‌, ఆరోగ్య శ్రీ పథకాలు కూడా ఇందులో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి రోజుకు 200 మంది రోగులు వస్తున్నారు. మరి కొద్ది రోజుల లో మరి కొన్ని సేవలను పెంచనున్నారు.. అందుబాటు లోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు..ప్రస్తుతం ఈ ఆసుపత్రికి చాలామంది రోగులు వస్తున్నారు.మంచి ఆదరణ కూడా పొందింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: