వైరల్ : ఎలా బ్రో.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?
ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి గురు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఇక జనావాసాల్లోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు దండయాత్ర చేస్తూనే ఉంటాయి. అలాంటిది పశువులపాకలో దోమలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పశువుల పై ఏకంగా యుద్ధమే చేస్తూ ఉంటాయి. దోమలు పశువుల పాకలో దోమల బెడద నుంచి మూగజీవాలకు కాస్త ఉపశమనం కలిగించడం కోసం ఎంతో మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే కొంతమంది పశువుల కొట్టంలో దోమలను తరిమి కొట్టేందుకు వేప చెట్టు ఆకులను ఒక చోట పెట్టి వాటితో పొగబెట్టి ఇక ఆ పొగ ద్వారా దోమలను తరిమి కొట్టాలనీ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గాలి ఎటు వీస్తే అటు వైపు పొగ వెళ్తూ ఉంటుంది. దీంతో పశువుల కొట్టంలో దోమల బెడద పూర్తిగా నివారించలేం అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక్కడ ఒక వ్యక్తి వినూత్నమైన ఆలోచన చేశాడు. ఒకచోట టేబుల్ ఫ్యాన్ అమర్చాడు. పక్కనే వేప ఆకులతో పొగ వేశాడు. ఇక అందులో నుంచి వస్తున్న పొగ ఫ్యాన్ ద్వారా సరిగ్గా పశువులు ఉన్న చోటికి వెళ్తుంది.ఈ వీడియో చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.