వైరల్ : వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. దగ్గరికి తీసుకుని ఓదార్చిన గుర్రం?

praveen
సాధారణంగా మనిషికి ఏదైనా బాధ వస్తే దానిని మనసులో దాచి పెట్టుకోలేరు. కావలసిన వారికి ఎవరికైనా చెబితే బాధ తగ్గుతుంది అని భావిస్తూ ఉంటాడు. మనసుకి దగ్గరైన వారు కాస్త బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకుంటే బాగుండు అని ఇక మనసులో అనుకుంటూ ఉంటారు. హలో ఎవరైనా ఆప్తులు దగ్గరికి తీసుకుంటే దుఃఖాన్ని ఆపుకోవటం కళ్ళల్లో నీరు ఆపుకోవడం ఎవరి తరము కాదు అనే చెప్పాలి. బాధలో ఉన్నప్పుడు ప్రియమైన వారి దగ్గరికి తీసుకుంటే ఉండే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పడం మాత్రం చాలా కష్టం. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు ఇష్టమైన జంతువులు కూడా వారి యజమాని బాధను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుని ఓదార్చుతాయి అన్న దానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి.

 మనుషులకు జంతువులకు మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉంది అని చెబుతూ ఉంటారు. అందుకే మనుషులు జంతువులు కూడా అర్థం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే మనుషుల పోలికలు ఉండే చింపాంజీలు మనుషుల హావభావాలను చూపించడమే కాదు మనుషులు బాధలో ఉన్నప్పుడు దగ్గరికి తీసుకొని ఓదార్చడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి అన్న దానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు వైరల్ గా మారిపోయాయి.  ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలు సైతం ఇలాగే ప్రేమను చూపిస్తాయని పలురకాల వీడియోలు చెప్పకనే చెప్పాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఒక గుర్రం కూడా మనిషిని ఓదారుస్తుంది అన్న దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.
 ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఓ మహిళకు ఎంత బాధ వచ్చిందో ఏమో ఒక చోట కూర్చుని లోలోపల కుమిలిపోతుంటారు. ఎవరైనా కావాల్సిన వారి దగ్గరికి వచ్చి ఓదార్చక పోతారా అని ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలోనే ఎంతో ప్రేమగా పెంచుకున్న గుర్రం ఆమె  దగ్గరికి వచ్చింది.  ఇక ఆ మహిళలను ఎంతగానో దగ్గరికి తీసుకుంది. దీంతో ఇక దుఃఖాన్ని ఆపుకోలేక పోయినా ఆ మహిళ వెక్కివెక్కి ఏడ్చింది. ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: