వైరల్ : పోయేకాలం అంటే ఇదే.. ట్రైన్ వస్తుంటే ఏం చేసాడో చూడండి?
ఇలాంటి తరహా వీడియోలు ఇటీవలి కాలంలో చాలానే వెలుగులోకి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు పోయే కాలం అంటే ఇదే.. రైలు వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఇలా ముందుకు వెళ్ళి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవడం అవసరమా అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఉంటారు . ఇక ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూసిన తర్వాత కూడా అందరి నోటా ఇదే మాట వినిపిస్తుంటుంది. మహా అయితే ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అవుతుంది అంతమాత్రానికే ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవడం అవసరమా అని ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు చేస్తున్నారు అందరూ.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఇటవా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఒక వ్యక్తి బైక్. కానీ అతను మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నప్పటికీ పట్టాలపైకి బైక్ తో వెళ్ళాడు. అయితే అయితే అవతలివైపు నుంచి రైలు వస్తుండటంతో ఇక పట్టాలపై వేచి ఉన్నాడు. అంతలోనే మరో వైపు నుంచి ఇంకో రైలు దూసుకు వచ్చింది. గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తీసేందుకు ప్రయత్నించాడు.. కానీ అది పట్టాల లో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అంతలోనే రైలు దూసుకువచ్చింది. దీంతో అతను పక్కకు తప్పుకున్నాడు. చివరికిట్రైన్ కింద పడి ద్విచక్ర వాహనం ధ్వంసమైంది.