మూసీ నదిలో జలకన్యలు.. వైరల్ గా మారిన వీడియో?

praveen
జలకన్యలు.. ఈమాట గురించి ప్రతి ఒక్కరు వినడం తప్ప చూసిన వారు మాత్రం లేరు అని చెప్పాలి. అప్పుడెప్పుడో వెంకటేష్ హీరోగా వచ్చిన ఒక సినిమాలో జలకన్యలు  ఉంటారని.. ఇక వారు ఎలా ఉంటారు అన్న  విషయాన్ని చూపించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కరు నిజంగానే సముద్రాలూ నదులలో జల కన్యలు ఉంటారు అని నమ్మడం మొదలుపెట్టారు. వారికి అతీతమైన శక్తులు ఉంటాయని వాటి రూపురేఖలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయని నమ్ముతుంటారు. అయితే ఇటీవలి కాలంలో జలకన్యలు కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెరమీదకు వచ్చాయి..

 కానీ ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు అన్నీ కూడా కేవలం ఫేక్ వీడియోలు మాత్రమే అన్న విషయం తేలింది. ఇప్పుడు హైదరాబాద్ లో జలకన్యలు అన్న ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  నగరంలో గత వారం రోజులుగా వర్షాలు ఎంతలా దంచికొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూసీ పరీవాహక ప్రాంతాలు అన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇక ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అటు వరద ఉధృతి కూడా తగ్గుతుంది. ఈ క్రమంలోనే ఇక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారందరూ మళ్ళీ తమ నివాసాలకు చేరుకుంటున్నారు అని  చెప్పాలి. అయితే మూసీ నదిలో జలకన్యలు ఉన్నాయ్ అంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 అదేంటి జలకన్యలు సముద్రాల్లో ఉంటాయి అని అంటూ ఉంటారు. కంపుకొట్టే మూసీ నదిలో కూడా ఉంటాయా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత మాత్రం నిజంగానే మూసీ నదిలో జలకన్యలు ఉన్నాయని మీరు నమ్మకుండా ఉండలేరు. మూసీలో జలకన్యలు ఒడ్డున కూర్చొని సేదతీరుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ వీడియో ఎక్కడ గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసినట్టు లేకపోవడం గమనార్హం. దీంతో ఇది నిజమా అబద్దమా అని కన్ ఫ్యూజన్ లో పడిపోయారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: