రాకాసి చేప : నెట్టింట వైరల్?

Purushottham Vinay
ఇక మనకు తెలియని ఎన్నో వింత జీవులు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఐతే రెక్క గుర్రం ఇంకా జలకన్య వంటి కొన్ని ప్రాణులు పౌరాణిక కథల్లో మాత్రమే కనిపిస్తాయి. ఎన్నో కథలు అలాగే సినిమాల్లో వాటిని చూశాం. అయితే నిజ జీవితంలో ఎవరూ చూడలేదు. చిలీ (Chile) లో నివసిస్తున్న కొంత మంది మత్స్య కారులు ఇలాంటి జీవిని గుర్తించడం జరిగింది. ఇక ఇది అచ్చం సినిమాల్లో చూపించే.. శాపగ్రస్త చేపను పోలి ఉంది. ఈ నేపథ్యంలో దాని వల్ల ఏం జరుగుతుందోనని ఇంకా ఎలాంటి విపత్తు మంచుకొస్తుందోనని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చిలీలో దొరికిన ఆ చేపను జెయింట్ ఓర్ ఫిష్ (Giant Orefish) అని అంటారు. అలాగే కింగ్ ఆఫ్ హెర్రింగ్స్ అని పిలుస్తారు. దీని పొడవు వచ్చేసి ఐదు మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 16 అడుగులు ఉంటుంది. ఇక ఈ రాకాసి చేప దొరికిందని తెలియగానే.. ప్రజలు చాలా పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రస్తుతం ఆ వీడియో టిక్‌టాక్‌లో అయితే వైరల్‌గా మారింది. మన దేశంలో టిక్‌ టాక్‌పై నిషేధం ఉన్నందువలన దీని వీడియోలు మనకు అంతగా కనిపించడం లేదు.


కానీ దాని ఫొటోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల హుక్‌కు ఇది చిక్కింది.ఓర్ షిఫ్‌లు అనేవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి ఎన్నో పౌరాణిక కథలలో కూడా దీని గురించి చెప్పారు. ఈ చేపలు భవిష్యత్తును కూడా అంచనా వేస్తాయని చెబుతుంటారు.ఓర్ చేప కనిపించిస్తే.. అది అపశకునమని కూడా విశ్వసిస్తారు. ఇంకా ఏదో కీడు జరగబోతుందని నమ్ముతారు. ఈ చేప 2011వ సంవత్సరంలో జపాన్‌ సముద్ర తీరంలో కనిపిచిందని.. ఆ తర్వాత భారీ సునామీ జపాన్‌పై విరుచుకుపడిందని కూడా కొందరు చెబుతున్నారు. ఇక జపాన్‌లో సునామీని ఓర్ ఫిష్ ముందుగానే పసిగట్టిందని అందువల్ల ఇప్పుడు చిలీలో కూడా అలాంటి విపత్తే రావచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: