వైరల్ వీడియో : తలపై నీళ్ల గ్లాసుతో కుక్క క్యాట్ వాక్.. చూస్తే అవాక్?
అయితే ఇలా ప్రేమగా పెంచుకున్న కుక్కలు ప్రత్యేకమైన టాలెంట్ వుండేలా ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కుక్కలు ఏదో ఒక టాలెంట్ నిరూపించుకున్న సమయంలో దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక శునకానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత కుక్క టాలెంట్ కి ఆశ్చర్య పోవటమే కాదు.. వావ్ అంటూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.
సాధారణంగా ఒక మనిషి తలపై నీళ్ల గ్లాసు పట్టుకుని క్యాట్ వాక్ చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఒక కుక్క మాత్రం ఏకంగా తలపై నీళ్ల గ్లాసు పట్టుకుని ఎంతో అందంగా క్యాట్ వాక్ చేస్తోంది. ఇక నీళ్ల గ్లాసు లో నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా.. ఎంతో అందంగా క్యాట్ వాక్ చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా ప్రశంసలు కురిపించ కుండా ఉండలేకపోతున్నారూ అని చెప్పాలి. కుక్కకు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చిన యజమానిని మెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. మీరు కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా మీ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.