నీటి మీద తేలియాడుతూ యోగా..వాట్ ఏ ఐడియా..

Satvika
యోగా ఆసనాలను ఎలాగైనా చేయవచ్చు అని ఓ వ్యక్తి నిరూపించాడు... అతను నేల మీద కాకుండా ఏకంగా నీటి మీద యోగా చేశాడు..మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతూ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది యోగా. నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానంలో ఉంది. అందుకే మన దేశంలో పుట్టిన యోగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అన్నిసార్లు అన్ని ఆసనాలు వేయలేరు కానీ సందర్భాన్ని బట్టి యోగా చేస్తుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చాలా మంది నిరూపించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి మాత్రం నీటిపై యోగా చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. గోదావరిఖనిలోని సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న రమేష్..ఇలా నీటిపై పలురకాల యోగా ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నారు. సింగరేణి క్వార్టర్స్ ఈతకొలనులో కోచ్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తి ఇక్కడ యువకులకు ఈత నేర్పిస్తారు. తనతో పాటు ఔత్సాహికులకు ఇలా నీటిపై యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నారు కృష్ణమూర్తి. ఆయన వద్ద యోగా నేర్చుకున్న రమేష్ సైతం ఇలా నీటిపై యోగా చేస్తూ అబ్బురపరుస్తున్నారు.

ఆసనం తీరును బట్టి అరగంట నుంచి గంట వరకు కదలకుండా నీటిపైన ఒకే ఆసనంలో ఉండడం తోటి ఈతగాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది...గత 40 ఏళ్ళుగా అతను ఈత కొచ్ గా ఉన్నాడు.నీటిపై యోగా మొదలు పెట్టాడు. కోచ్ కృష్ణమూర్తి శిక్షణలో కేవలం 30 రోజుల్లో నీటిపై సునాయాసంగా యోగాసనం వేయడం నేర్చుకున్నాడు. రోజు ఒక గంట లేదా రెండు గంటల పాటు యోగా చేస్తేనేగానీ ఇంటికి వెళ్లనని అంటున్నాడు రమేష్. ఇలా రోజూ యోగా చేయడం వలన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నాడు...మొత్తానికి యోగా డే సందర్భంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు..అతనికి సంభందించిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: