వైరల్ : బ్రూస్ లీ మళ్లీ పుట్టాడుగా?

praveen
కుంఫు కరాటే యోధుడైన  బ్రూస్ లీ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రూస్ లీ స్ఫూర్తితోనే ఎంతోమంది కుంఫూ  శిక్షణ తీసుకున్న అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆ తర్వాత కుంగ్ ఫు లో  ఎంతోమంది ప్రావీణ్యం సంపాదించి నప్పటికి బ్రూస్ లీ అంతగా గుర్తింపు మొత్తం ఎవరికీ రాలేదు. ఇప్పటికీ కరాటే కుంగ్ ఫు  నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా బ్రూస్ లీ ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కరాటే యోధుడిగా అటు బ్రూస్ లీ సాధించిన రికార్డులు కూడా ఎన్నో ఉన్నాయి.

 అయితే బ్రూస్ లీ కరాటే యోధుడిగా మాత్రమే కాకుండా అటు సినిమాల్లో తన యాక్షన్ తో ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక బ్రూస్ లీ నటించిన ఎన్నో సినిమాలు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి అని చెప్పాలి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన బ్రూస్ లీ తక్కువ వయస్సులోనే చనిపోతాడు అని ఎవరూ ఊహించలేదు. అకాల మరణంతో బ్రూస్ లీ ఎంతో మంది అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అయితే బ్రూస్ లీ చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకూ కుంగ్ ఫు  కరాటే లో అంత గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు.

 మరీ ముఖ్యంగా బ్రూస్ లీ లాంటివాడు మరొకడు పుట్టడు అని అందరూ భావించారు కానీ ఇక్కడ ఒక ఐదేళ్ల బుడ్డోడు మాత్రం బ్రూస్ లీ ని అచ్చుగుద్దినట్టు దింపే స్తూ   ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పిల్లాడి ప్రతిభ   చూసి నెటిజన్లు అందరూ మరో బ్రూస్ లీ పుట్టాడు అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియోలో చూసుకుంటే వెనకాల టీవీ లో బ్రూస్ లీ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ వస్తుంది. సినిమాలో బ్రూస్ లీ ఎలా అయితే యాక్షన్ చేశాడో టీవీ ముందు నిలబడిన ఐదేళ్ల బుడ్డోడు కూడా అదే రీతిలో యాక్షన్ చేసి అదరగొట్టాడు. నిజంగా బ్రూస్ లీ చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడేమో అని అనిపిస్తూ ఉంది ఈ బుడ్డోడిని చూస్తూ ఉంటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: