అమెరికా నగర వీధుల్లో ఐశ్వర్య ర్ పాటకు డ్యాన్స్ చేసిన యువకుడు..

Satvika
ఈ మధ్య అమెరికాలో తెలుగు పాటలకు మంచి క్రేజ్ అందుకున్నాయి.. తెలుగు యువత వల్ల ఇంకా పాట మరింత పాపులర్ అవుతున్నాయి.ఇప్పుడు మరోసారి బాగా ఫెమస్ అయ్యాయి. ఓ యువకుడు బాలివుడ్ నటి ఐశ్వర్య పాటకు అదిరిపొయె స్టేప్పులు వేసి అందరికి షాక్ కు గురి చేశాడు.. టిక్‌టాక్ పుణ్యమా అని నెటిజన్ల కు షార్ట్ వీడియో ఫార్మాట్ బాగా వంటపట్టేసింది. వేలకొద్దీ షార్ట్ వీడియోల ను చూస్తూ గంటల కొద్దీ కాలం వెళ్లదీయగల సమర్థులు కూడా ఉన్నారు.

 
నెటిజన్లు పలు రకాల వీడియోలను వైరల్ చేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం నెటిజన్లను..అందులోనూ భారతీయులను అమితంగా ఆకట్టుకుంటూ ఓ యువకుడు ట్రెండింగ్‌లో కి వచ్చాడు. అతడెవరో కాదు మన భారతీయుడే కావడం విశేషం.. విషయాన్నికొస్తే..   న్యూయార్క్ నగర వీధుల్లో స్కర్ట్ ధరించి జెయినిల్ మెహతా చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జెయినిల్ ఎంచుకున్న పాట బర్సో రే రిలయన్స్ సంస్థల వ్యవస్థాపకుడు ధీరూబాయ్ అంబానీ జీవితం స్ఫూర్తితో తీసిన 'గురు' సినిమాలోనిది ఈ పాట..


ఈ పాటకు ఐశ్వర్యారాయ్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకుల ను కట్టిపడేస్తుంది. ఇక జెయినిల్ కూడా ఐశ్వర్య ను గుర్తుతెస్తూ ఓ స్కర్ట్ ధరించి తన స్టెప్పులతో నెటిజన్లను ఉర్రూతలూగిస్తున్నాడు. కానీ.. స్త్రీల దుస్తుల ను ధరించి అతడు డ్యాన్స్ చేయడం కొందరు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది కూడా.. ఈ క్రమం లో.. స్కర్ట్ ధరించడానికి కారణమేంటో కూడా జెయినిల్ వివరించాడు. స్రీల దుస్తులు, పురుషుల దుస్తులు అనే తేడా ల్లేకుండా వస్త్రాల డిజైనింగ్ ఉండాలని పిలుపునిస్తూ ఇలా స్కర్ట్ ధరించి డ్యాన్స్ చేశానని ఆయన చెప్పుకొచ్చాడు. మరింత మంది పురుషుల తనలాగా డ్రెస్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చాడు. నెట్టింట ట్రెండింగ్‌ లో ఉన్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్ వేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: