ఓన్లీ వన్స్ ఫసక్ అంటే ఇదేనేమో.. ఏం జరిగిందో చూడండి?

praveen
సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఏదైనా వంతెన ప్రారంభించిన సమయంలో ఆ వంతెనపై ఎంతోమంది సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఎంతో మంది జనాలు కూడా అక్కడ గుమిగూడి ఉంటారు.  ఇక్కడ ఇలాంటిదే జరిగింది. నగర మేయర్ సహా ఆయన కుటుంబం మరికొంత మంది అధికారులు జర్నలిస్టులు ఇలా చాలా మంది జనాలు అప్పుడే ప్రారంభించిన వంతెన పైకి ఎక్కారు. ఇక వంతెనపై ఎంతో స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చారు.

 కానీ అంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓన్లీ వన్స్ ఫసక్ అన్న డైలాగ్ కు సరిగ్గా సరిపోయే విధంగా ప్రారంభించిన మొదటి రోజు ఆ వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై నడుస్తూ ఉన్న వారందరూ కూడా కిందపడిపోయి గాయాల బారిన పడ్డారు. మెక్సికోలోని క్యూర్నావాకా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక నగరంలోని సహజ ప్రకృతి అందాల ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఒక నది వెంట నడక కోసం ప్రత్యేకమైన వంతెనను నిర్మించారు. నీటి ప్రవాహం మీదుగా ఈ వంతెన వేలాడుతూ ఉంటుంది.

 ఈ క్రమంలోనే నగర మేయర్ ఇటీవలే వంతెనను ప్రారంభించగా ఆయన భార్య పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. అంతేకాదు నగర పాలక మండలి సభ్యులు అధికారులు మీడియా సిబ్బంది కూడా ఆ వంతెన మీద కి వచ్చి నడవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొంతమంది వంతెనపై గంతులు కూడా వేశారు. ఒక్కసారిగా వంతెన తెగిపోయింది. దీంతో మేయర్ సహా ఆయన భార్య 20 మంది కూడా పది అడుగుల ఎత్తు నుంచి పడిపోయారు. దీంతో ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు కాళ్లు చేతులు నడుము విరిగిన ఎనిమిది మందిని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: