ఫుల్ గా మందుకొట్టి రైలు బోగిపై 220 కి.మీ ప్రయాణించిన వ్యక్తి!

Purushottham Vinay
ఇక బీహార్ లో ఓ యువకుడు ఫుల్ గా మద్యం సేవించి..ఆ మద్యం మత్తులో గూడ్స్ రైలు బోగీ పైన ఎక్కాడు.అయితే రైలు కదులుతున్న కూడా అసలు సోయ కూడా లేకుండా అలాగే బోగీపైన పడుకొని 220 కిలోమీటర్లు దాకా ప్రయాణించాడు. ఇక గయాలోని మాన్పుర్ లో రైలు బోగీపైన పడుకున్న అతడిని..రైలు జార్ఖండ్లోని ధన్బాద్కు చేరుకున్న సమయంలో స్టేషన్లోని ప్రయాణికులు ఇంకా అలాగే సిబ్బంది గుర్తించి కిందకు దించారు. ఇక ఆ యువకుడిని తునకుప్ప ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం ఉన్నప్పటికీ ఆ యువకుడు క్షేమంగానే బయటపడ్డాడు. దిగేటప్పుడు విద్యుత్ తీగలకు తగిలితే పెద్ద ప్రమాదం జరిగేదని ఆ స్టేషన్లో ఉన్న ఆందోళన చెందారు. అయితే యువకుడిని ధన్బాద్ స్టేషన్ లో సిబ్బంది కిందకు దించుతున్న వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా, రెండు రోజుల క్రితం బీహార్లో ఓ వ్యక్తి రైలు ఇంజిన్ చక్రాలపై కూర్చొని మొత్తం 190 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మంచినీళ్లు కావాలని ఆ యువకుడు ఏడ్చేసరికి లోకోపైలట్ అతడిని గుర్తించాడు. పాట్నా మీదుగా రాజ్గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన అనేది జరిగింది.


ఇక పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ద పూర్ణిమ ఎక్స్ ప్రెస్ ట్రైన్ జర్నీలో ఉండగా.. అక్కడ ఇంజన్ వద్ద కూర్చున్న డ్రైవర్ కి ఎవరూ ఏడుస్తున్నట్లుగా శబ్దం వినిపించింది. ఇక గయా జంక్షన్లో రైలు ఆగిన తర్వాత ఇంజిన్ కింది భాగాన్ని ఓసారి పరిశీలించాడు డ్రైవర్. ఎవరో ఓ వ్యక్తి మంచినీళ్లు కావాలని అరుస్తున్నట్లు ఆ డ్రైవర్ గుర్తించాడు.ఇక టార్చ్లైట్ వేసి చూడగా ఇంజిన్ కింది భాగంలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూశాడు. కొందరు ప్రయాణికుల సాయం తీసుకొని ఆ యువకుడిని బయటకు తీశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి అక్కడ నుంచి దెబ్బకు పరార్ అయ్యాడు. అయితే యువకుడి వివరాలేవీ తెలియలేదు. అలాగే ఈ విషయంపై డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ యువకుడికి మతిస్థిమితంగా లేదని అక్కడి అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై పెద్దగా వివరాలు కూడా చెప్పలేదు. రాజ్గిర్లో యువకుడు రైలు ఎక్కి ఉంటాడని ఆ పోలీసులు భావిస్తున్నారు. యువకుడు క్షేమంగా ఇక్కడికి చేరడం ఆశ్చర్యంగా ఉందని వారు అంటున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: