అక్కడ ఆపరేషన్ చెయ్యాలంటే స్మార్ట్ ఫోన్ లైట్ వుండాల్సిందే!

Purushottham Vinay
ఇక స్మార్ట్ ఫోన్లలోని లైట్స్ చీకట్లో వెలుగులు నింపడానికి మాత్రమే కాదు.. అత్యవసర పరిస్థితిల్లో కూడా రోగులకు వైద్యం అందించడానికి కూడా ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆపరేషన్ చెయ్యాలంటే స్మార్ట్ ఫోన్ లైట్ వుండాల్సిందే.ఇక తాజాగా బీహార్‌లోని సాసారాం జిల్లాలో తరచుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ అంతరాయంతో ప్రజలు మాత్రమే కాదు ఇంకా ఆసుపత్రిలో చికిత్సనందించడానికి వైద్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ సదర్ ఆసుపత్రి వైద్యులు విద్యుత్ సరఫరా లేని సమయంలో తరచుగా స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్ సహాయంతో క్రిటికల్ కండిషన్ లోని రోగులకు చికిత్స చేస్తున్నారు. చీకటిలో కేవలం ఫ్లాష్‌లైట్‌ను మాత్రమే ఉపయోగించి ఆ వైద్యులు ఆపరేషన్ చేస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ సమస్య ఇటీవల తెరపైకి వచ్చి బాగా వైరల్ అవుతుంది.


ఇక సదర్ ఆసుపత్రి వైద్య సిబ్బందిలో ఒకరైన డాక్టర్ బ్రిజేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి రోజూ కూడా ఆసుపత్రిలో విద్యుత్ కోతలు ఉన్నాయని.. దీంతో ఇక తరచుగా స్మార్ట్ ఫోన్ వెలుగులో చికిత్స చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోందని ఆయన అన్నారు. ఒకొక్కసారి కొన్ని ఇతర సమస్యల వల్ల కూడా ఆసుపత్రిలో తరచూ కరెంటు కోతలు ఏర్పడుతున్నాయని డాక్టర్ బ్రిజేష్ కుమార్ తెలిపారు.ఇక మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి వైద్యులు ఆపరేషన్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టడం ప్రారంభించిన అనంతరం రోహ్‌తాస్ జిల్లా మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కూడా హామీ ఇచ్చారు.అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఇంకా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ పాత్రపై అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ACMO) ఇంకా విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌తో కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఈ న్యూస్ దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: