ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుసా?

Satvika
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే తెలియని వాళ్ళు బహుశా ఉండరు.. అందరికి అంతగా తెలుసు..ఎక్కడికి వెళ్ళిన కూడా ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు.. అందుకే రోజు రోజుకు దీని ప్రాముఖ్యత పెరిగి పోతుంది.అయితే వాటిని తినే వారి సంఖ్య రోజురొజుకు పెరుగుతుంది. కానీ అవి ఎప్పుడూ వెలుగు లోకి వచ్చాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఫ్రెంచ్ ఫ్రైస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. వాటికి పెద్ద స్టోరీనే ఉంది.. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


పార్టీ అయినా, వివాహ వేడుక అయినా, ప్రతి ప్రోగ్రామ్‌లో ఖచ్చితంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపిస్తుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.ఫ్రాన్స్, బెల్జియం, అమెరికా ఈ మూడు దేశాలు ఫ్రెంచ్ ఫ్రైస్‌పై తమ సొంత వాదనను వినిపిస్తాయి. ఓ పుస్తకం అనే పుస్తకంలో బెల్జియన్ రచయిత ఆల్బర్ట్ వెర్డియన్ ఫ్రెంచ్ ప్రైస్‌కి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. మొదటిసారిగా ఫ్రెంచ్ ఫ్రైస్ బెల్జియం లోని నమూర్ ప్రాంతం లో తయారయ్యింది. 1680లో చలికాలంలో సరస్సులు గడ్డకట్టుకుపోయి చేపలు కరువైపోయాయి. దీంతో వారు బంగాళదుంపలు వేయించుకుని తినడం మొదలుపెట్టారు.


ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం లో అమెరికా సైనికులు అక్కడికి వచ్చినప్పుడు, వారు వీటికి ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు పెట్టారు. ఫ్రెంచ్ ప్రొఫెసర్ బెల్జియన్ ఈ వాదనను ఖండించారు. 1630 సంవత్సరంలో ఆ ప్రాంతం లో బంగాళదుంప పంట లేదన్నారు. కాగా 1780లో ప్యారిస్‌ లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారని ఫ్రెంచ్ ప్రజలు భావిస్తారు. 1802 లో ప్రెసిడెంట్ థామస్ జెఫెర్సన్ ఫ్రెంచ్ చెఫ్ హోనోరే జూలియన్‌ ను బంగాళాదుంపల ముక్కలను వేయించి వైట్ హౌస్‌లో రాత్రి భోజనానికి ముందు వడ్డించమని అడిగారని అమెరికన్ చరిత్ర కారులు తెలిపారు..1850ల నాటికి అమెరికాలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది..అదండి ఫ్రైస్ గురించిన అసలు కథ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: