వైరల్ : మనిషి, కంగారూ మధ్య భీకర యుద్ధం?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణాల వ్యవధిలో  అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతున్నాయ్. అయితే ఇలా సోషల్ మీడియాలో తెర మీదికి వచ్చే కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వీడియోలు తెగ వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా ఒక వీడియో  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో ఓ వ్యక్తి కంగారు నుంచి తన కుక్కను కాపాడేందుకు ఏకంగా కంగారుతో కిక్ బాక్సింగ్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారి అందరికీ నవ్వు తెప్పించింది.

 కానీ చాలా మటుకు అయితే కంగారూలు కోపం వచ్చిందంటే మనుషులపై దాడి చేస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు అందరూ. అందుకే ఆ జంతువులతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉంటారు చాలామంది. కంగారూల కి కోపం వస్తే ఏ రేంజ్ లో దాడి చేసి విధ్వంసం సృష్టిస్తారూ అన్నది ఇక్కడ వైరల్ గా మారిపోయినా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తిపై కంగారు దారుణంగా దాడి చేసింది  అతను ఆ కంగారు నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరలేదు.దీంతో మనిషి కి కంగారు కి మధ్య భీకర యుద్ధం జరిగింది.

 ఈ ఘటనలో సదరు వ్యక్తి ఎంతగానో గాయపడ్డాడు అని చెప్పాలీ. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సెంట్రల్ విక్టోరియా లో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి పెరట్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది  ఆరడుగులు ఉన్న కంగారు. రావడం రావడమే అతడిపై దాడి చేసింది. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ తర్వాత లేచి కంగారు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది మాత్రం సాధ్యం కాలేదు. కంగారు  అతన్ని కాళ్లతో తొక్కడమే కాదు చేతిని కరిచింది. గాయాలు చేసింది. ఆరు నిమిషాల పాటు జరిగిన భీకర యుద్ధంలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే కంగారూలు ఉద్రేకానికి లోనైనప్పుడు ఇలా మనుషులపై దాడి చేస్తాయని నిపుణులు చెబుతు ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: