Viral : వామ్మో.. ఈ కాయగూర ధర లక్ష రూపాయలా?

Purushottham Vinay
ఇక ఇప్పటికే దేశంలో నిత్యావసర సరుకుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరలు పెరుగుదలతో సామాన్యుడికి భారంగా మారుతోంది.ఇక చౌకగా దొరికే కాయకూరలు సైతం ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. ఇవి అధిక వర్షాల కారణంగానో, ఇతర కారణాల వల్లనో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కూరగాయలు కొనేందుకు సామాన్యుడు సైతం బాగా వెనుకడుగు వేస్తున్నాడు. అయితే కూరగాయ ధరలు సుమారు 50 నుంచి 100 లోపే ఉండగా ఇక్కడొక కాయకూర ధర మాత్రం ఏకంగా లక్ష రూపాయల వరకు ధర పలకడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూ తెగ వైరల్‌ అవుతోంది. 'హాప్‌ షూట్స్‌' అనే కాయగూర ధర వచ్చేసి కిలోకు సుమారు లక్ష రూపాయలపైనే ఉంటుంది. దీని గురించి పెద్దగా ఎవ్వరు కూడా విని ఉండదు. ఇప్పుడు ఇంత ధర పలుకుతుందని సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ కావడం షాక్‌కు గురవుతున్నారు. దీనిని బీర్‌ తయారీలో ఉపయోగిస్తారని ఇంకా మిగిలిన కొమ్మలను కూరగాయలుగా వాడుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇక అంతేకాదండోయ్‌.. దీనిని వివిధ ఔషధాలలో కూడా ఉపయోగిస్తారని వారు చెబుతున్నారు.


ఈ కాయగూరని బీహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడని ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్‌ షూట్స్‌ని భారత్‌లోని బీహార్‌కి చెందిన అమ్రేష్‌ సింగ్‌ అనే యువరైతు సాగు చేస్తున్నాడని జోరుగా ప్రచారం అనేది జరుగుతోంది.అయితే ఈ వార్తలపై ఏడాదిలో వైరల్‌ కాగా ఇక అధికారులు తనిఖీ చేసిన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.ఇక దీనిపై ప్రచారం జోరుగా సాగడంతో కొందరు మీడియా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు సదరు యువకుడిని కలుసుకున్నారు. ఆయన పొలాన్ని వారు సందర్శించారు. అక్కడ ఇటువంటి కూయగూరలు పండిస్తున్నట్లు లేదు. ఇటువంటి పంట పండిస్తున్నాడనే విషయంలో అసలు ఎలాంటి నిజం లేదని అధికారులు ప్యాక్‌చెక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇలాంటి పంట పండిస్తున్నారనే విషయం కూడా తనకు తెలియదని సదరు రైతు అధికారుల ముందు తెలిపాడు. అమ్రేష్‌సింగ్‌ తన పొలంలో నల్ల బియ్యం ఇంకా అలాగే గోధుమలు పండిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: