అది చేస్తూ గజినీలా మారిపొయిన భర్త.. షాక్ లో భార్య..

Satvika
ఎక్కడైనా శృంగారం చేస్తూ గతం మర్చిపోయిన వారిని చూశారా?.. అది ఎలా సాధ్యం.. ఇలాంటి సందెహాలు రావడం అందరికి సహజం..కానీ ఇది నిజం మీరు విన్నది అక్షరాల అదే..ఆగండి..ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.ఓ భర్త, భార్య తో శృంగారం చేస్తూ గతం మర్చిపోయాడు..అసలు గజినీ స్టోరీ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఐర్లాండ్‌కి చెందిన ఓ 66 ఏళ్ల వృద్ధుడికి వింత అనుభవం ఎదురైంది. భార్యతో 10 నిమిషాల శృంగారం తర్వాత అతన్ని మతిమరుపు ఆవహించింది.


శృంగారం తర్వాత సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకున్న అతను.. అందులో తేదీ చూసి షాకయ్యాడు. ఆ ముందు రోజే తన పెళ్లి రోజు అన్న విషయాన్ని మరిచిపోయాడు. నిజానికి భార్యతో కలిసి అతను పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నాడు. కానీ ఆ విషయాలేవీ అతనికి గుర్తులేవు. ఐరిష్ మెడికల్ జర్నల్ 'మే' నెల సంచికలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.భార్యతో శృంగారం తర్వాత మతిమరుపు ఆవహించిన ఆ వృద్ధుడు ఆరోజు, ఆ ముందు రోజు జరిగనవేవీ గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. ఆ రెండు రోజులు ఏం జరిగిందో చెప్పాలంటూ భార్య, కూతురిని పదే పదే అడిగాడు. శృంగారం తర్వాత ఇలా మతిమరుపు ఆవహించడాన్ని వైద్య పరిభాషలో ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నేసియా గా పరిగణిస్తారు.

 
ఇలాంటి కేసులు చాలా అరుదుగా వెలుగులోకి వస్తున్నాయి.50-70 ఏళ్ల వయసువారి లో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి.సదరు వృద్ధుడికి తన పేరు, వయసు, ఇతరత్రా వివరాలన్నీ గుర్తున్నాయి. కానీ రెండు రోజులుగా జరిగనవేవీ ఎంత ప్రయత్నించినా అతనికి గుర్తురాలేదు.2015లోనూ అతనికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా మరోసారి అతను టీజీఏ బారినపడటంతో స్థానికంగా న్యూరాలజీ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులన్నీ నార్మల్ అనే వచ్చాయి. సాధారణంగా టీజీఏ అనేది పెద్ద సమస్య కాదని సదరు వైద్యులు తెలిపారు.కొద్ది రోజులకు సెట్ అవుతుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: