అమ్మాయనుకోని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత షాకయ్యాడు!

Purushottham Vinay
ఇక మారుతున్న కాలం నేపథ్యంలో మారుతున్న మానవ సంబంధాలు ఇంకా అలాగే విపత్కర లైంగిక సంబంధాల గురించి వినాల్సి వస్తోంది. అందుకే మీరు కూడా వివాహామాడుతున్నారా అయితే పెళ్లి కోడుకు పెళ్లికోడుకో కాదు అన్ని విధాలా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీరు చేసుకోబోయే పెళ్లి కూతురు నిజంగా పెళ్లి కూతురేనా అన్నది కూడా కచ్చితంగా చెక్ చేసుకోండి.లేకపోతే ఇక్కడ ఓ యువకుడు మోసపోయినట్లుగా మీరు కూడా మోసపోవాల్సి వస్తుంది.పెళ్లి జరిగిన కొన్ని క్షణాలకే పెళ్లికొడుకుకి ఊహించని షాక్ తగిలింది. తనకు నచ్చిన అమ్మాయితో కొత్త లైఫ్ మొదలైందనే సంతోషం కాస్తా రెండు క్షణాల్లో మాయం అయిపోయింది. అతను ప్రేమించి పెళ్లాడింది అమ్మాయిని కాదని తెలుసుకుని.. దెబ్బకు హృదయం బద్ధలైంది. ఇక ఈ విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకుందాం.పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీ ఇంకా కేంద్రపాడ జిల్లాలోని రామనగర్ గ్రామానికి చెందిన బిస్వనాథ్ మండల్ కుమార్తె మేఘనా మండల్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం అనేది ఏర్పడింది. కేవలం 15 రోజుల స్నేహంలో వీరిద్దరూ కూడా ప్రేమలో పడ్డారు. తర్వాత వారు ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


ఇందులో బాగంగా మే 24 వ తేదీన జాజ్‌పుర్‌లోని ఛండీఖోల్‌లో కలుసుకున్నారు. తర్వాత అలోక్ కుమార్ ఇంకా మేఘనాని బసుదేవ్‌పూర్‌లోని కాసియాలో ఉన్న తన మేనమామ ఇంటికి తీసుకెళ్లి వారికి పరిచయం చేశారు.ఇద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న అలోక్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. అనుకున్న వెంటనే ఇద్దరికి చాలా ఘనంగా పెళ్లి చేశారు.ఇక అదేరోజు సాయంత్రం కుటుంబ సమేతంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్‌లోనే దెబ్బకు అసలు బండారం బయటపడింది. రిసెప్షన్‌కు వచ్చిన ఓ స్థానిక వ్యక్తి వధువును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దాంతో పెళ్లికొడుకు అలోక్ ఇంకా అతని కుటుంబం షాక్ అయ్యారు. అతని పేరు మేఘనాథ్ అని ఇంకా అతను తన దూరపు బంధువని ఆ అతిథి చెప్పాడు. అలా పెళ్లి కూతురు అమ్మాయి కాదు.. అబ్బాయి అని తెలిసుకుని వరుడు ఇంకా అతని కుటుంబ సభ్యులు కంగుతిన్నారు.దాంతో గ్రామస్థులు ఆ మేఘనాథ్‌ను చితకబాదారు. అతని బట్టలు కూడా చింపివేశారు. అతని పొడవాటి జుట్టును కూడా కత్తిరించారు. ఆ తరువాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి మేఘనాథ్ ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. అలా కోటి ఆశలతో పెళ్లి చేసుకున్ని ఓ యువకుడి ఆశలన్నీ కూడా అర నిమిషంలో తారుమారైపోయాయి. పాపం అతనికి ఊహించని పరిస్థితి ఎదురైందనే చెప్పాలి. ఇక ఫేస్‌బుక్ పరిచయం అంత కొంపముంచింది. ఇప్పటికైనా ఫేస్ బుక్ పరిచయాలు పరిమితంగా ఉంచుకొంటేనే మేలని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: