షవర్మా తింటున్నారా? ఇది ఒకసారి చూడండి..

Satvika
షవర్మా.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరి పోతుంది.. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు తింటారు.. వ్యాపారం లో లాభాలను పొందాలని చాలా మంది నిర్వహాకులు కుళ్ళిపోయిన మంసాన్ని కూడా విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అయిన జనాలు మాత్రం వీటిని తినడానికి ఎగబడుతున్నారు.. అయితే మీ ప్రాణాల మీదకు వచ్చినట్లే.. డబ్బులు ఇచ్చి మరి జబ్బులను కొని తెచ్చుకోవడం అంటున్నారు ఆహార నిపుణులు..


 అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసిన షవర్మా తింటే మంచిదే. కాని కుళ్లిన, పాడైన షవర్మా తింటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు డాక్టర్లు. కొత్త కొత్త జంక్‌ ఫుడ్స్‌ ఇప్పుడు మార్కెట్లో కనబడుతున్నాయి. ఆకర్షణీయమైన పేర్లతో కనబడే వంటకాలు ప్రజల ప్రాణాల తో చెలగాటమాడుతున్నాయి.కేరళలో చికెన్‌తో తయారు చేసిన షవర్మా తిని దేవానంద అనే స్టూడెంట్‌ చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హైదరాబాద్‌ లో గల్లీగల్లీ లో షవార్మా సెంటర్లు కనబడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నప్పటికి కేరళలో జరిగిన ఘటన హైదరాబాద్‌ లో కూడా జరిగే ప్రమాదముంది.. చాలా మంది అస్వస్థతకు  గురైన సంగతి తెలిసిందే..


ఈ షవర్మా విషయం పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..కుళ్లిపోయిన, పాడైన చికెన్‌ తో షవర్మా చేస్తున్న దుకాణాలపై పలు చోట్ల దాడులు నిర్వహించారు. చెన్నై, తిరువళ్ళూరు, కోయంబత్తూరు లో తమిళనాడు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. నిజానికి షవర్మాను చాలాసార్లు వేడి చేస్తుంటారు. ఈ విషయం పై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.. షిగెల్లా తో పాటు సర్మోనెల్లా అనే బ్యాక్టీరియాలు ఆ షవర్మాలో బయటపడ్డాయి. ఈ బ్యాక్టిరియా కారణంగా డయేరియాతో పాటు జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని డాక్టర్లు తెలిపారు..రుచి కన్నా ముందు మన ఆరోగ్యం ముఖ్యం..ఇది గుర్తుంచుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: