ఆ కొండ కూర కోసం ఎగబడుతున్న జనం.. ఎక్కడంటే?

Satvika
కొన్ని కూరలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో సీజన్ లో ఒక్కో విధమైన వాటికి మంచి డిమాండ్ సంతరించుకుంటుంది.వాటిలో వుండే పొషకాలు కూడా ఎక్కువ కావున జనాలు వాటిని ఒక సారైన్ తినాలని ఆసక్తి చూపిస్తారు.గిరిజన ప్రాంతాల ప్రజలు ఎక్కువగా సహజంగా దొరికే వాటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు.గిరిజన ఆచార వ్యవహారాలతో పాటు నోరూరించే వంటకాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.. అడవి తల్లిని నమ్ముకున్న వారంతా అక్కడే లభించే వాటితో ఆహారాన్ని వండు కొని తింటారు.సహజంగా దొరికే వాటితో ఆహారం చేసుకొని తినడం వల్ల వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు.


కొండ కూరలు గురించి చాలా మందికి తెలియదు.. అసలు ఆ పేరును కూడా పెద్దగా విని ఉండరు.అయితే ఈ సీజన్లో ప్రత్యేకమైన పుష్కలమైన పోషకాలతో కొండల్లో లభించే ఆకుకూరలు, వాటి వంటకాల విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం..విశాఖ మన్యంలో ఆకు కూరలకు విశేష ప్రాముఖ్యత ఉంది. వాటిలో మండి కూర, కుంకోడి కూర, గొడ్రు కూర..! ఆకు కూరలెన్ని ఉన్నా.. ఈ సీజన్లో మాత్రమే ఏజెన్సీలో విరివిగా దొరికే ఈ కూరను సేకరించే పనిలో ఉంటారు అక్కడి గిరిజనులు..


ఒక్కో ఆకు కూరతో ఒక్కో రకమైన వెరైటీ డిష్ ను తయారు చేస్తారు గిరిజనులు. మండి, గొడ్రు కూరలను వేపుడు చేసి తింటారు. ఇక కుంకోడి కూరను పిండితో కలిపి కూరగా వంటకం చేస్తారు గిరిజనులు. వండిన ఆ కూరలను ఇంటిల్లిపాది ఇష్టంగా ఆరగిస్తారు. లొట్టలు వేసుకుని మరి ఆహా ఏమి రుచి అంటూ తింటారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ మండి, గొడ్రు, కుంకోడి కూరలు.. కేవలం వంటకంగా మాత్రమే కాకుండా దివ్య ఔషధంగా కూడా భావిస్తారు గిరిజనులు. రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని నమ్ముతుంటారు. ఇంకా ఎన్నో రొగాలను నయం చెస్తాయని వాళ్ళు అంటున్నారు.గిరిజనుల వంటకాలను చూసి మైదాన ప్రాంత వాసులు కూడా ఈ కూరలను కొనుక్కొని తీసుకెళ్తుంటారు..ఇదండీ ఆ కూరలకు గల ప్రత్యేకత.. మంచి ఆరోగ్యం కావాలి అంటే అక్కడకి వెళ్ళినప్పుడు మీరు ట్రై చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: