ఏం ఐడియా రా బాబు..భలే మ్యానేజ్ చేశావ్..

Satvika
ఇప్పుడు ఎక్కడ చూసిన ఎండలు మండి పోతున్నాయి.. బయటకు రావాలంటే జనాల గుండెలు వేగంగా కొట్టుకుంటూన్నాయి.. సుర్యూడు రాకముందె బయట పనులు చకచకా పూర్తీ చేసుకోవాలని జనాలు అభిప్రాయ పడుతున్నారు.. అది కాక సమ్మెర్ లో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువే.. మార్చి నెల రాకముందే ఎండలు పెరుగుతూన్నాయని తెలుస్తుంది.. రోజు రోజుకు ఉష్ణోగ్రత లు పెరుగుతూన్నాయి.. ఎండ వేడిమిని తాళలేక అతలాకుతలం అవుతున్నారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం, శరీరానికి చలువ చేసే డ్రింక్స్ తాగడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం వంటివి చేస్తున్నారు..



అత్యవసర పరిస్థితుల లో తప్పక బయటకు వెళ్ళే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. స్కార్ఫ్   వెసుకోవడం, నీళ్ళను అందుబాటు లో ఉంచుకోవాలి.. గొడుగును దగ్గర పెట్టుకోవాలి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎండలు ఎంతున్న పెళ్లిళ్లు ఆగవు కదా. ఎండలను తట్టుకునేందకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. తాజాగా ఓ పెళ్లి బృందం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది. ఓ పెళ్ళి బృందం చేసిన ఆలోచన అదిరిపొయిందనే చెప్పాలి.



వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ పెళ్లి మండపానికి తరలించాలి. అయితే, ఎండలు తీవ్ర స్థాయిలో ఉండటం తో పెళ్లి నిర్వాహకులు సరికొత్త ఐడియా అమలు చేశారు. పెళ్లి బృందం వరకు పెద్ద పరదాను ఏర్పాటు చేశారు. చతురస్రాకారం లోని టెంటుకు నాలుగు మెటల్ ఫ్రేమ్స్‌ ఏర్పాటు చేసి.. వాటిని నాలుగు దిక్కులు పట్టుకునేందుకు నలుగురు మనుషులను ఏర్పాటు చేశారు. ఇలా టెంటును ముందుకు తీసుకెళ్తూ.. ఎండ నుంచి కాపాడుకోవడం కోసం ప్లాను చేశారు. మొత్తానికి ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఇందుకు సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎలా వుందో మీరు ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: