ఈ వీడియో చూస్తే ఇంకెప్పుడు పుట్టినరోజు చేసుకోరు!

Purushottham Vinay
పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యులు ఇంకా అలాగే స్నేహితులతో కలిసి ఆరోజు చాలా గ్రాండ్‌గా మన బర్త్‌ డేని సెలబ్రెట్‌ చేసుకుంటాం.అయితే కొంతమంది అత్యుత్సాహం కారణంగా ఒక్కోసారి ఈ బర్త్‌డే వేడుకలు అనేవి దారి తప్పుతుంటాయి. ప్రాణాలమీదకు కూడా వస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. అంబర్‌నాథ్‌ ప్రాంతంలో ఓ పుట్టిన రోజు వేడుకల్లో ప్రమాదవశాత్తూ ఆ యువకుడి ముఖానికి మంటలు అనేవి అంటుకున్నాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే అంబర్‌నాథ్‌కి చెందిన 20 సంవత్సరాల రాహుల్‌ మౌర్య ఇటీవల పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఈ వేడుకలో భాగంగా అతని స్నేహితులు గ్రాండ్‌గా కేక్‌ కటింగ్‌ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు.ఇక ఈ సమయంలో అతని స్నేహితులు అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. బర్త్‌డే బాయ్‌ కేక్‌ కట్‌ చేస్తుండగా అతనిపై గుడ్లు ఇంకా అలాగే కేక్‌తో పాటు ఫొమింగ్‌ స్ప్రే కూడా చల్లారు.




దీంతో చేతిలో వెలుగుతున్న క్యాండిల్‌ కారణంగా ప్రమాదవశాత్తూ ముఖానికి దెబ్బకు మంట అంటుకుంది. ఆ తర్వాత భయాందోళనకు గురైన అతని స్నేహితులు మంటను ఆర్పేందుకు చాలా విధాలుగు ప్రయత్నించారు. దీంతో అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డాడు ఆ బర్త్‌ డే బాయ్‌. ఈ బాగోతాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి రికార్డ్‌ చేశారు. ఇక ఆ తర్వాత 'జీవితాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి పుట్టిన రోజులకు దూరంగా ఉండండి' అనే క్యాప్షన్‌ తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఆ బర్త్‌డే బాలుడుకు ఇంకా భూమ్మీద నూకలున్నాయి'. 'ఇలాంటి వేడుకలకు చాలా దూరంగా ఉండాలి' అని సూచిస్తున్నారు. ఇక అదే సమయంలో పుట్టినరోజు స్నో ఫోమ్‌ ఉపయోగించవద్దని ఇంకా అలాగే ఇందులో మండే గుణాలు ఉండడం వల్ల ప్రమాదాలు అనేవి జరిగే అవకాశాలున్నాయని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: