వైరల్ : నడిరోడ్డుపై కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు?
అయితే ఇలా పురుషులకు తక్కువ కాదు అనుకునీ ఏదో గొప్ప పని చేశారు అనుకోకండి.. ఏకంగా రోడ్డు మీదే దారుణంగా గొడవపడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కిందా మీదా పడుతూ కొట్టుకున్నారు. ఇక ఇలా కొంతమంది యువతులు నడి రోడ్డుమీదే దారుణంగా కొట్టుకున్న ఒక వీడియో సంచలనం గా మారిపోయింది. సాధారణంగా ఇప్పటివరకూ ఎంతోమంది అబ్బాయిలు ఇలా రోడ్డుపై కొట్టుకోవడం అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక అబ్బాయిల ఎవరైనా ఇలా రోడ్డుపై కొట్టుకుంటే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలు ఇలా నడి రోడ్డు పై కొట్టుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలు నడిరోడ్డుపై కొట్టుకొని బీభత్సం సృష్టించిన వీడియో వైరల్ గా మారింది. ఒకే కళాశాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక రోడ్డు పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న సమయంలో గొడవ మొదలైంది. దీంతో ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదండోయ్ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వారిని విచిత్రంగా చూస్తున్న పట్టించుకోలేదు. ఇక అటువైపుగా వెళ్తున్న వాహనదారుడూ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇప్పటి వరకు తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు అంటూ చెబుతున్నారు..