ఏపీ లో కల్తీ మద్యం కి చెక్.. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..!!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా మద్యానికి బానిసైన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న , పెద్ద మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాటికి బానిస అవుతూ ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఉన్నారు. అయితే అలాంటి వారికి చెక్ పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. కొత్తగా ఎలాంటి బ్రాండెడ్ వాటికి కూడా అనుమతి ఇవ్వలేదని తెలియజేశారు సిఎస్ రజిత్ భార్గవ. ఆంధ్రప్రదేశ్లో చివరిగా డిస్టిలరీ పర్మిషన్ 2019 ఫిబ్రవరి లో మాత్రమే ఇచ్చామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఏపీ ప్రభుత్వం సరికొత్త పాలసీని 2020 లో తీసుకువచ్చారని  తెలియజేశారు. బెల్ట్ షాపులు, పర్మిట్ లను తొలగించి కేవలం షాపులకు పరిమితం అయ్యేలా చేశారు. ఇలాంటి వాటితో ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసే వారి సంఖ్య కాస్త తగ్గి పోయిందని సమాచారం. మరి ఎక్కడా లేనివిధంగా మద్యం క్వాలిటి టెస్టింగ్ విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతోంది అన్నట్లుగా భార్గవ్ తెలియజేశారు.

2014 సంవత్సరం నుంచి 2018 మధ్య 99 వేల శాంపుల్ టెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. ఇక అదే సమయంలో 2020- 21 వ సంవత్సరంలో దాదాపుగా 1.55 లక్షల శాంపుల్ టెస్ట్ లు చేసినట్లు తెలియజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1.47 లక్షల శాంపుల్ టెస్ట్ చేసినట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. ఇక ప్రతి ఏడాది లక్షా 60వేల వరకు శాంపుల్ టెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో పోలిస్తే ఐఎమ్ఎఫ్ఎల్ సేల్స్ 30 శాతం తక్కువగా ఉన్నాయని తెలియజేశారు. కెమికల్ టెస్టింగ్ 115 శాతం పెరిగాయని.12.5 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు 70 వేల మందిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. ఇక ఇప్పటి వరకు 93, 722 కేసులు నమోదైనట్లు గా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: