ఓరివీడి వేషాలో.. చూస్తే మీరు ఇదే అంటారు?

praveen
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎంతోమంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లైకుల ఊబిలో కూరుకుపోతు ఏకంగా ప్రాణాలకు తెగించి మరీ కొన్ని ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది చూసి ఆనంద పడిపోయిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ లైకులు కొట్టేస్తున్నారు. ఇలా నేటి రోజుల్లో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న ఎన్నో వీడియోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్ని వీడియోలు కొంతమందిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈ వీడియో చూస్తున్నంత సేపు డ్రైవర్ అంత ప్రమాదకర రీతిలో స్టెంట్ ఎలా చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. వీరికి ప్రాణాల మీద ఆశ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక చూస్తున్నంతసేపు అందరికి భయమేస్తుంది. కానీ చివర్లో అసలు ట్విస్టు బయటపడడంతో అందరూ షాక్ అయిపోతారు అనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగింది అంటే ఇక్కడ ఓ యువకుడు పెద్ద ట్రక్ ని నడుపుతున్నాడు.

 ఇక ఆ ట్రక్ లో పాటలు కూడా వస్తు న్నాయి. ఈ క్రమంలోనే పాటల మీద ఎంతో జోరుగా డాన్స్ చేస్తూ డ్రైవింగ్ సీటు నుంచి లేచి పక్కకు వెళ్ళి పోతాడు సదరు వ్యక్తి.. అంతేకాదు ఇక డోర్ దగ్గర నిలబడి వేలాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నంతసేపు ఓరి నాయనో వీడు ఏంట్రా బాబు ఇంత ఘోరంగా చేస్తున్నాడు. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాడా ఏంటి మరి ఇంత ఘోరంగా చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇక ఇలా అందరు టెన్షన్ పడుతున్న సమయంలో ఊహించని ట్విస్ట్ రివీల్ చేశాడు సదరు వ్యక్తి. అసలు ట్రక్ నడవడం కాదు కదా ఇంజన్ కూడా ఆన్ లో లేదని తెలుస్తుంది. కొన్ని ట్రక్కులను గూడ్స్ రైలులో తరలిస్తుండగా ఆ వాహనంలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇలా రైల్లో ఉన్న ట్రక్కులో ఎక్కి ఇలాంటిది చేసి అందరిని భయపెట్టాడు సదరు డ్రైవర్..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: