ఇక ఐపీఎల్‌లో కేవలం చీర్ గాల్స్ మాత్రమే కాదు.. ఫ్రాంచజీ ఓనర్స్ కూడా జిల్ జిల్ జిగాలా బాగా మెరుస్తున్నారు. వీఐపీ గ్యాలరీల్లోనే కాకుండా.. ఇంకా ఐపీఎల్ వేలంలోనూ వారు గ్లామర్ పంచుతున్నారు. ఈసారి ఐపీఎల్ యాక్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానురాలు కావ్య మారన్. బ్యూటిఫుల్ లుక్స్‌తో అచ్చం సినిమా హీరోయిన్‌లాగా ఉన్న కావ్య గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చింగ్ అనేది జరుగుతోంది. ఎవరీ కావ్య మారన్ అంటూ నెజిజన్లు గూగుల్ లో తెగ సర్ఫింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఐపీఎల్ వేలంలో.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇంకా కుమార్తె సుహానా ఖాన్‌లతో పాటు జూహ్లీ చావ్లా కూతురు జాహ్నవి చావ్లాలకు కూడా విపరీతమైన క్రేజ్ అనేది పెరిగింది.
ఇక తాజాగా ఐపీఎల్-2022లో అందరి దృష్టిని ఆకర్షించింది అందాల ముద్దుగుమ్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్. ఆమె వేలం టేబుల్ దగ్గర కూర్చున్న ఫోటోలు ఇంకా అలాగే వీడియోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. గూగుల్ సెర్చ్‌లు ఇంకా అలాగే సోషల్ మీడియాలో 'హూ ఈజ్ కావ్య మారన్', 'ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ ఎవరు' వంటి ప్రశ్నలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. IPL 2022 మెగా వేలంలో ఈ 30 ఏళ్ల కావ్య మారన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్ టామ్ మూడీ ఇంకా ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టేబుల్ పంచుకున్నారు. ఈ అందమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని ఇంతకి ఎవరో కాదు తమిళనాడుకు చెందిన ఫేమస్ నిర్మాత కళానిధి మారన్ కుమార్తనే ఈ కావ్య మారన్.
ఆమె మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మునిమనవరాలు కూడా. అలాగే డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కావ్యకు మేనమామ. ఇక ఇప్పటికే ఆమె మారన్ కుటుంబం ఆధ్యర్యంలో నడుస్తున్న సన్ టీవీ విభాగాలైన సన్ మ్యూజిక్‌తో పాటు FM ఛానెల్‌ల బాధ్యతలు అనేవి చూస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పనులు కూడా ఆమనే టేకప్ చేశారు.ఇక తన నిర్ణయాలతో పాటు అందంతోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెలుగులు తీసుకొస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ కావ్య.