సచిన్ వీడియో షేర్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

praveen
రోడ్డు నిబంధనలు పాటించండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి.. ముందు ఉన్నవారు మాత్రమే కాదు వెనుక ఉన్నవారు కూడా హెల్మెట్ ధరించండి.. లేదంటే ఏ క్షణంలోనైనా ప్రాణాలు పోయే ప్రమాదముంది. జాగ్రత్త..  అంటూ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారుట్రాఫిక్ పోలీసులు. ఇక అంతే కాకుండా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఎంతకీ వినకపోవడంతో భారిగా జరిమానా కూడా విధిస్తున్నారు.


 అయితే ఇక పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది వాహనదారులు మాత్రం ఇటీవలి కాలంలో రోడ్డు నిబంధనలు పాటించక పోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ఎంతోమంది  ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇదంతా కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్ల అన్న విషయం తెలిసిందే. అయితే  మేము హెల్మెట్ ధరిస్తున్నాము అంటూ చెబుతున్నారు కొంతమంది. కాని కేవలము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించి వెనకాల ఉన్న వ్యక్తిది ప్రాణం కాదు అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.


 ఇటీవల కాలంలో వెనుక ఉన్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నోసార్లు పోలీసుల అవగాహన కల్పించగా ఇక ఇప్పుడు ఒక ఆసక్తికర వీడియోని విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వీడియోని షేర్ చేశారు. కార్ లో వెళ్తున్న సచిన్ ను చూసి అభిమానులు వెంట వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బైక్ పై ప్రయాణం చేస్తుండగా వారిని చూసిన సచిన్ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు పోలీసులు.
ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలబ్రిటీల సినిమా పోస్టర్లు క్రికెటర్లకు సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు  అవగాహన కల్పించేందుకు కాస్త కొత్తగా ట్రై చేసిన ఘటనలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: