కొత్తగా ఏదైనా అనిపిస్తే వాటిని మనకు తెలిసిన వాళ్లందరి తో పంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. ప్రపంచం లో జరిగే వింతలను, ఆసక్తి కలిగిన విషయాలు వెంటనే అందరికి తెలిసిపోతాయి. అలాంటి వాటిలొ ఒకటి 3డి ప్రింటెడ్ ఇల్లు.. ఇదెంది వినడానికి వింతగా వుంది. అవును ఒక ఇంటి వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటూ వస్తుంది. ఆ ఇంటి పూర్తీ విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
విషయానికొస్తె.. మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఛైర్మన్
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు.అంతే కాదు ఆయనకు ఏదైనా నచ్చితే దానిని అందరి తో పంచుకుంటూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నారు.. అయితే, తాజాగా మరో అంశంపై స్పందించారు. ముంబైకి చెందిన బిజినెస్ మొగల్ ఐఐటీ
మద్రాస్ మద్దతుగల స్టార్ట్అప్ త్వాస్తా 21 రోజుల్లో నిర్మించిన దేశం లోని మొదటి 3డి ప్రింటెడ్ ఇంటికి సంబంధించిన ఒక 104 సెకన్ల నిడివి గల వీడియోను సోషల్
మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాల ను తాను అనుసరిస్తున్నానని, ఈ రంగంలో మన దేశం అభివృద్ది చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం దేశానికి గర్వ కారణం అంటూ
మహీంద్రా అన్నారు. విదేశాల్లో 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాల ను అనుసరిస్తున్నాను. ఈ రంగంలో ఐఐటి
మద్రాస్ మద్దతు తో వచ్చిన టెక్ కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం చాలా అవసరం. మీరు కొత్తగా నిధుల సమీకరణ జరిపారని నాకు తెలుసు. ఇప్పుడు అద్భుతమైన ఆలోచన చేశారు. అక్కడ నేను ఉండటం కోసం ఒక గది దొరుకుతుందేమో అని అన్నాడు. మొత్తాని కి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.