వావ్:జియో యూజర్లకు శుభవార్త తెలిపిన రిలయన్స్ .!!

Divya
రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఒక గొప్ప శుభవార్త ను తీసుకు వచ్చింది.. తన 4 జి మొబైల్ నెట్వర్క్ గల సేవలను..పల్లెల్లోకి విస్తరింప చేయాలనే ఆలోచనలో భాగంగా.. కడప జిల్లాలోని గిడ్డంగివారి పల్లి లో.. 4జి సేవల్ని ప్రారంభించడం జరిగింది.. ఈ 4G గల టవర్ ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజా నిధులతో పాటు జియో అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. గడ్డంగివారి పల్లె చుట్టూ ఉన్న ప్రాంతాలలో అన్ని కొండలు ఉండడంచేత అక్కడికి సిగ్నల్ రాక ఇబ్బందిపడుతూ ఉండడంతో.. ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను పొందలేక ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యని పరిష్కరించడానికి కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ముందుకు వచ్చి ఈ టవర్లను ఏర్పాటు చేయడానికి కృషి చేశారు.
దీంతో టవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగాయి.. ఈ సెల్ టవర్ సిగ్నల్స్ ను ఉపయోగించుకొని ఇప్పుడు గ్రామ ప్రజలు హైస్పీడ్..4G సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక విద్యార్థులు కూడా కరోనా సమయం కాబట్టి.. బయట ఎక్కడికి వెళ్లకుండా వారి విద్య ను కొనసాగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక అంతే కాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు, వారి కమ్యూనికేషన్ ని పెంచుకోవడం.. వినోదం పొందడం, వారి యొక్క ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం వంటివి ఇప్పుడు పల్లెలకు కూడా వెళ్లాయి. అందుకోసమే ఈ ఫోర్ జి హై స్పీడ్ సేవలను ప్రజలకు అందిస్తున్నామని అక్కడికి వచ్చిన కొంతమంది jio అధికారులు తెలియజేశారు.
దేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉన్న jio ప్రస్తుతం 4G సేవలను మారుమూల ప్రాంతాలలో తమ సేవలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా తమ జియో ఫోన్ ద్వారా ఎంతో మంది గ్రామీణులు వారి పనులను చేసుకుంటున్నారు.. తమ కస్టమర్లు సైతం ఇలాంటి సేవలను అందించడంలో ముందుంటామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: