రెచ్చిపోయిన మహిళ.. నడిరోడ్డుపై ఏం చేసిందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసలు మనుషుల్లో మానవత్వం అనేది ఇంకా బ్రతికి ఉందా అని ప్రతి ఒక్కరిలో అనుమానం కలగక మానదు. ఎంతో చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నవారు సైతం విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. చదువుకొని ఒక మంచి పదవిలో కొనసాగుతున్న వారు ఎంతో హుందాగా నడుచుకోవడం మానేసి దారుణంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మానవత్వం కూడా చూపించకుండా ఎదుటి వ్యక్తులపై  దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లో ఇలాంటి తరహా ఘటన జరిగింది.

 ఇటీవల కాలంలో ఎంతోమంది చిరువ్యాపారులు విషయంలో ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. తామేదో చిరు వ్యాపారులకు డబ్బులు ఇచ్చి వారి కుటుంబాన్ని పోషిస్తున్నాము అన్న విధంగా వ్యవహరిస్తూ ఏకంగా పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ వుంటారు. ఇటీవలే ఒక పానీపూరి బండి వద్ద ఉల్లిపాయలు వేయలేదు అన్న కారణంతో ఒక మహిళ ఏకంగా దారుణంగా వ్యవహరించిన  ఘటన హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇలా ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ వచ్చిన దాంట్లో గౌరవంగా బ్రతుకుతున్న చిరు వ్యాపారులను ఎంతో చులకనగా చూస్తూ ఉన్న వారు కూడా నేటి రోజుల్లో ఎక్కువైపోయారు. ఇక్కడ ఓ మహిళ ఇలాంటి ఈ కోవలోకే వస్తుంది. ఆమె ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తోంది. ఎంతో హుందాగా నడుచుకోవాల్సింది పోయి చిరువ్యాపారి విషయంలో దారుణంగా ప్రవర్తించింది.


 ఏకంగా రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారి పై విరుచుకుపడి దాడి చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా రోడ్డుపై కారు పార్క్ చేసింది. అటువైపుగా తోపుడు బండిపై చిరు వ్యాపారి వస్తున్నాడు. పొరపాటున పార్క్ చేసి ఉన్న కారుకి తోపుడు బండి తాకింది. దీంతో లక్షల పెట్టుకున్న కారుకి తోపుడు బండి తాకిస్తావా అంటూ  కోపంతో ఊగిపోయింది సదరు మహిళ. దీంతో ఇక ఆ తోపుడు బండి పై ఉన్న పండ్లు అన్నింటిని  రోడ్డుపై పడేసింది. అలా చేయొద్దు మేడం ప్లీజ్ అంటూ ఆ చిరువ్యాపారి ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో సదరు మహిళ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: