వైర‌ల్ : 40 వ‌సంతాల ప్రేమ‌.. ఇప్పుడు పెళ్లిపీట‌లు.. వ‌రుడెవ‌రో తెలిస్తే షాకే..?

N ANJANEYULU
ప్రేమ‌కు కులం, మ‌తం, వ‌య‌స్సు, ప్రాంతం, భాష‌, క‌ల‌ర్ ఇలా వీట‌న్నింతోని సంబంధ‌మే లేదు. అదేవిధంగా స‌రిహ‌ద్దులు, లింగ‌భేదాలు కూడా లేవు. అందుకే చాలా మంది ఖండాంత‌రాలు దాటి త‌మ జోడిని వెతుక్కుంటున్నారు. వ‌య‌స్సులో త‌న‌కంటే చిన్న‌వాళ్ల‌ను భాగ‌స్వాములుగా చేసుకోవ‌డం మ‌నం చూశాము.అమెరికాకు చెందిన ఒక మ‌హిళ ఎవ‌రినీ పెళ్లి చేసుకున్న‌దో తెలిస్తే నోరెళ్ల‌బెట్టి షాక్‌కు గుర‌వ్వాల్సిందే. ఎందుకు అంటే ఆమె పెళ్లాడింది త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన గులాబీ క‌ల‌ర్‌ని. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా, వింత‌గా ఉన్నా ఇది మాత్రం వాస్త‌వం.
వివ‌రాల్లోకి వెళ్లితే.. అమెరికాలోని లాస్ వెగాస్‌కు చెందిన కిట్టెన్ సెరా అనే మ‌హిళ‌కు పింక్ క‌ల‌ర్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఎంత‌లా అంటే ఆ క‌ల‌ర్‌తో 40 ఏళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌ని పేర్కొంటుంది ఆ అమెరిక‌న్ లేడీ. ఈ త‌రుణంలో నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని త‌మ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకున్న‌ది. జ‌న‌వ‌రి 01న కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలో గ్రాండ్ పింక్ క‌ల‌ర్‌ని పెళ్లి చేసుకున్న‌ది.
ఆ త‌రువాత పింక్ క‌ల‌ర్‌తో త‌న పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. ఇక్క‌డ విశేష‌మేమిటంటే.. సెరా త‌న వివాహ వేడుక‌లో పింక్ క‌ల‌ర్ దుస్తుల్లోనే ముస్తాబ్ అయింది. జుట్టుకు కూడా పింక్ రంగునే వేసుకున్న‌ది. చివ‌ర‌కు ఆమె ధ‌రించిన ఆభ‌ర‌ణాలు, లిప్‌స్టిక్, వెడ్డింగ్ రింగ్ మ్యారేజ్ కేకు, ఇంకా పెళ్లి వేదిక‌లోని వ‌స్తువుల‌న్నీ దాదాపు గులాబీ రంగుల్లోనే ఉన్నాయి. వివాహానికి హాజ‌రైన అతిథులంద‌రూ కూడా గులాబీ రంగు దుస్తులు ధ‌రించ‌డం విశేషం.
నిత్యం పింక్ క‌ల‌ర్‌లోనే ద‌ర్శ‌నం ఇచ్చే సెరాను చూసి ఒక‌రోజు చిన్న‌పిల్లాడు నీకు పింక్ క‌ల‌ర్ అంటే చాలా ఇష్టం క‌దా అని అడ‌గ‌గా.. సంతోషంగా మురిసిపోయింది ముద్దుగుమ్మ‌. పింక్ క‌ల‌ర్‌నే పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా అని ఆ బాలుడు చెప్ప‌డ‌ట‌. అప్ప‌టి నుండి గులాబీ రంగును వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది..? అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయింది సెరా. అనుకున్న‌ట్టే త‌న ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టిన‌ది. గ్రాండ్‌గా గులాబీ రంగుతో పెళ్లి పీట‌లు ఎక్కింది. పెళ్లి అయ్యాక వేరే వ్య‌క్తిని క‌న్నెత్తి చూడ‌ను. నేను చ‌నిపోయే వ‌ర‌కు పింక్ క‌ల‌ర్ డ్రెస్సులు త‌ప్ప వేరే రంగు దుస్తుల‌ను ధ‌రించ‌ను అని పెళ్లి వేడుక‌లో ప్ర‌మాణం చేసింది ఈ పింక్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: