బస్సులో కోడిపిల్లకు ఎంత చార్జీ వసూల్ చేశారో తెలుసా?

Satvika
కొన్ని ప్రాంతాల్లొ బస్సులలో అక్రమంగా చార్జీలను వసూల్ చెస్తున్నారు. మరీ దారుణంగా దండుకుంటున్నారు. బస్సుల లో లగెజ్ ను బట్టి చార్జీలు వసూల్ చేయాలి. కానీ కొన్ని ప్రాంతాల్లొ మాత్రం అన్యాయంగా చార్జీలు తీసుకుంటూన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. ఓ బస్సులో పది రూపాయలు కూడా విలువ చేయని కోడి పిల్లకు ఏకంగా యాబై రూపాయలు చార్జ్ చేశారు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇది నిజం.

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చెస్తుంది. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కర్ణాటక లో వెలుగులోకి వచ్చింది. లగేజ్ టికెట్ కూడా వసూలు చేస్తాడు కండక్టర్. ఆ లగేజ్ టికెట్ ప్రయాణికుల టికెట్ తో సమానంగా వుండదు. కానీ కేఎస్ఆర్టీసీ వారి వసూల్ వేరే లెవల్ ఉంటుంది. బంధువుల ఇంటి నుంచి ఓ వ్యక్తి సంచిలో కోడి పిల్లను తీసుకెళ్ళాడు. గ్రాములు బరువు కూడా ఉండని కోడి పిల్లకు టిక్కెట్ తిసుకొవాలని కండక్టర్. అది కూడా తక్కువేం కాదు. ఏకంగా 50 రూపాయల టికెట్ ఇచ్చాడు. దీంతో అవాక్కవ్వడం ఆ కుటుంబం వంతయింది.

చిన్న పిల్లకు టిక్కెట్ ఏంటి అని ఆ కుటుంబం ఎంత వారించినా కూడా ఆ కండక్టర్ వినకుండా టికెట్ కొట్టేశాడు. చెసెదెమి లేక అతను చెప్పిన అంత చెల్లించుకున్నారు.10 తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. కోడి పిల్ల టికెట్ తో కలిసి ఆ కుటుంబానికి మొత్తం రూ. 353 అయింది.. ఈ టిక్కెట్ ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దాంతో వైరల్ అయ్యింది.. అతని పై సీరియస్ యాక్షన్ తీసుకొవాల ని ప్రజలు డిమాండ్ చెస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: