వైరల్ : అమ్మో దయ్యం.. ఏం చేసిందో చూడండి?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది. ఇక మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దయ్యాలు భూతాలు ఉన్నాయా అని అడిగితే.. ఊరుకోండి సార్ ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంటి అవన్నీ వట్టి మాటలే అని కొట్టి పారేస్తూ ఉంటారు కొంతమంది.. అమ్మో నిజంగా దయ్యాలు ఉన్నాయ్ సార్.. మా ఊర్లో చాలా దెయ్యాలు ఉన్నాయని ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటూ ఉంటారు అంటూ దెయ్యం పేరెత్తగానే భయంతో వణికి పోతూ ఉంటారు ఎంతోమంది. ఇలా ఇప్పటికీ ఆధునిక సమాజంలో కూడా దయ్యాలు ఉన్నాయా లేవా అన్నది మాత్రం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. కానీ ఎవరి నమ్మకం వాళ్ళకి ఉంటుంది కదా.



అయితే అప్పుడప్పుడు దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యే ఫుటేజీలో చూసి కొంతమంది ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరహా ఒక వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంది.  కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నిజంగానే దెయ్యాలు ఉన్నాయి అని నమ్మాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో కూడా ఇలాగే ఉంది. ఏకంగా ఒక బార్ లో కస్టమర్లను ఒక దెయ్యం హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సి సి టీవీ కెమెరాలో రికార్డయింది..


 యూకే లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది విల్డ్ షేర్ లో ఉన్న లాంగ్ ఆర్మీ బార్ లో కౌంటర్ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ బార్ సిబ్బందితో మాట్లాడుతున్నారు ఒక కస్టమర్. ఇంతలో కౌంటర్ డెస్కులో ఉన్న ఒక గ్లాస్ దానంతట అదే కింద పడి పగిలిపోయింది  అక్కడ ఉన్న మిగతా గ్లాసులు అన్నీ అలాగే ఉండిపోయాయి. అయితే అక్కడ ఎవరూ కూడా డెస్క్ ను కదిలించలేదు. కనీసం గాలి కూడా రావడం లేదు. ఈ క్రమంలోనే అక్కడున్న కస్టమర్ అక్కడున్న సిబ్బంది కూడా కాస్త భయపడిపోయారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చే చెయ్యి కౌంటర్ ముందు ఉంచి చూడగా ఎవరూ లేరు.ఇలా ఎవరు లేకుండానే లోపల ఉన్న గ్లాస్ దానంతట అదే కింద పడిపోవడంతో బార్ లో దెయ్యం ఉంది అనే వార్తలు తెరమీదకు వచ్చాయి. గతంలో కూడా బార్ లో ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి అంటున్నారు అక్కడి స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: