వైరల్ : రెచ్చిపోయిన బౌలర్.. బ్యాట్ మెన్ హెల్మెట్ ఎగిరిపడింది?

praveen
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట కి ఎంతగానో క్రేజ్ ఉంది. అందుకే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి  వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇకపోతే క్రికెట్ ఆటలో ఎప్పుడూ ఇలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మైదానంలోకి వచ్చే బ్యాట్స్మెన్ భారీగా పరుగులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే వైవిధ్యమైన బంతులను సంధించి బ్యాట్స్మెన్లను తికమక పెట్టి వికెట్ తీసుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు బౌలర్. ఈ క్రమంలోనే చిత్ర విచిత్రమైన బంతులు విసరడం చేస్తూ ఉంటాడు. ఇలా బౌలర్లు విసిరిన బంతులు కొన్ని కొన్ని సార్లు ఏకంగా బ్యాట్స్మెన్ లకు ఊహించని షాక్ ఇస్తూ ఉంటాయి.

 ఇలా కొన్ని కొన్ని సార్లు బంతి తగిలి బ్యాట్స్మెన్లు గాయాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కానీ ప్రమాదం తప్పింది ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో ఒక బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని బ్యాట్ మెన్  కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అతని బ్యాట్ నుంచి తప్పించుకున్న ఆ బంతి నేరుగా హెల్మెట్ కు బలంగా తగిలింది. దీంతో తలకి ఉన్న హెల్మెట్ కాస్త తెగి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మార్ష్ కప్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే . ఇక ఈ కప్ లో భాగంగా క్వీన్స్ ల్యాండ్ బుల్స్, వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి.

 ఇక మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది ఇలా మ్యాచ్ జరుగుతున్న సమయంలో 28 ఓవర్లు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జిమ్మి పీటర్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో వైపు నుంచి కామరన్ గ్రీన్ బౌలింగ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అతను ఒక షార్ట్ పిచ్ బంతి సంధించాడు. అయితే ఊహకందని  విధంగా వేగంగా దూసుకొచ్చిన ఆ బంతి ఏకంగా  హెల్మెట్ కు తగిలింది. బంతి బలంగా తగలడంతో తలపై ఉన్న హెల్మెట్ కాస్త ఎగిరి కింద పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇతర ఆటగాళ్లంతా అతని వద్దకు వచ్చి ఏదైనా గాయం అయిందా అని తెలుసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: