వైరల్ : అర్ధరాత్రి దూరంగా కదులుతున్న నల్లటి ఆకారం.. వెళ్లి చూస్తే షాక్?

praveen
Your browser does not support HTML5 video.అర్ధరాత్రి చుట్టూ చిమ్మచీకటి అలాంటి సమయంలో రోడ్డుపై వెళుతుంటే ఎలా ఉంటుంది. దాదాపుగా అందరిలో ఒక భయం మాత్రం ఉంటుంది. అయితే పైకి మాకు ఏమి భయము వేయడం లేదు.. మేము చాలా ధైర్యవంతులం అని చెప్పినప్పటికీ లోలోపల మాత్రం అందరూ భయపడుతూనే ఉంటారు. అయితే ఇలా అర్ధరాత్రి బైక్ ఫై వెళ్తున్న సమయంలో దూరంగా ఏదో ఆకారం కనిపించింది అంటే చాలు ఒక్క సారిగా గుండె జారి పోయినంత పని అవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా దయ్యాలు భూతాలు ఉంటాయని నమ్ముతుంటారు జనాలు. అందుకే అర్ధరాత్రి ఏదైనా ఆకారం కనిపిస్తే అటువైపు కూడా కన్నెత్తి చూడకుండా వేగంగా వాహనాన్ని నడుపుతూ ఉంటారు.


 ఇక ఇలాంటివి చిత్రమైన అనుభవాలు అప్పుడప్పుడు కొంత మందికి ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు యువకులకు ఇలాంటి ఘటన ఎదురైంది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు బైక్ ఫై వెళ్తున్నారు. లైట్ వెలుతురు లో రాయి రప్ప ఎక్కడ ఉందో అని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇంతలో కొంత దూరంలో వారికి ఒక వింత ఆకారం కనిపించింది. వాళ్లకి మొదట భయం వేసింది.. కానీ బైక్ లైట్ వెలుతురును అటువైపుగా తిప్పారు. దీంతో అక్కడ ఏదో నల్లటి ఆకారం కదులుతూ కనిపించింది. మనసులో కాస్త భయపడి నప్పటికీ ఒక దగ్గరికి వెళ్లి గమనించారు.


 దగ్గరకు వెళ్లి చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే అక్కడి నల్లటి ఆకారం లో ఉంది ఏకంగా ఒక పెద్ద మొసలి.  ఈ ఘటన ఎక్కడ జరిగింది కాదు ఏకంగా ఏపీ లోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో ఇటీవలే ముసలి కలకలం రేపింది. ఏకంగా జనసంచారం ఉండే ప్రాంతంలో మొసలి ప్రత్యక్షమవడం అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఇక రాత్రి సమయంలో ముసలి ని గమనించిన ఇద్దరు యువకులు స్థానికులకు సమాచారం అందించారు. పిడుగురాళ్ల లో చెరువు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అయితే రాత్రి సమయంలో మొసలి వాకింగ్ ట్రాక్ పైకి వచ్చి చేరడం గమనార్హం. ఈ క్రమంలోనే స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ మొసలని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: