వైరల్ : ఇది చూస్తే కొత్తిమీర మరోసారి కొనరు?

praveen
సాధారణంగా అందరూ మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. మార్కెట్ కు వెళ్ళినప్పుడు అందరూ ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ అయితే ఫ్రెష్ గా కూరగాయలు కనిపిస్తాయో అక్కడ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా ఫ్రెష్ గా కూరగాయలు లేకపోతే కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడరు జనాలు. కేవలం కూరగాయల విషయంలోనే కాదు ఇక ప్రతి వంటకాలలో వేసే కరివేపాకు, కొత్తిమీర విషయంలో కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. జనాలు ఇక మార్కెట్ మొత్తం తిరిగి ఎక్కడ కొత్తిమీర, కరివేపాకులు ఫ్రెష్ గా ఉన్నాయి అని గమనించి ఆ తర్వాత కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ముఖ్యంగా కొత్తిమీర అనేది ప్రతి వంటకంలో తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా వంటకంలో ఉప్పు కారం లాంటివి ఎన్ని వేసినప్పటికీ కొత్తిమీర వేస్తే మాత్రం ఎందుకో ప్రత్యేకమైన రుచి వస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఎలాంటి వంటకంలో అయినా సరే కొత్తిమీర వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక కొత్తిమీర ఎంతో ఫ్రెష్ గా ఉంటేనే కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ కొత్తిమీర మార్కెట్లో ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలిపే ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఇక ఈ వీడియో చూసిన వారందరూ మరోసారి కొత్తిమీర కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేయడానికి భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కూరగాయల వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలు మురుగు నీటిలో శుభ్రపరచి విక్రయిస్తున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ తతంగాన్ని మొత్తం అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీసి భూపాల్ కలెక్టర్కు షేర్ చేశారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అలా మురికి నీటిలో కొత్తిమీరను శుభ్రం చేస్తున్న వ్యాపారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు వ్యాపారి పరారయ్యాడు. ఇక ప్రస్తుతం అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: