వైరల్ : పాపం.. పెళ్లి కోసం ఎన్ని కష్టాలో?

praveen
కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజుల్లో ఈ మాటను నిజం చేస్తున్నారు అందరు. చాలామంది  కష్ట సమయంలో కూడా కళ్యాణం చేసుకుంటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెళ్లి మాత్రం ఆపేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అయితే గతంలో కరోనా వైరస్ సమయంలో కూడా ఇలాంటి పెళ్లిళ్లతో ఎంతోమంది అవాక్కయ్యేలా చేశారు. ఓవైపు లాక్ డౌన్ కారణంగా అటు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో కూడా పెళ్లి ముహూర్తాన్ని అస్సలు ఆపకుండా ఏకంగా తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు.

 ఇక ఇలాంటి పెళ్లి లను చూసిన వారు అంత తొందరేం వచ్చిందో కొన్ని రోజులు ఆగితే సరిపోయేది కదా అనుకున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి పెళ్లి గురించే. పాపం ఆ వరుడు వధువుకు ఎంత కష్టం వచ్చిందో. చూస్తుంటేనే మనసు తరుక్కుపోతుంది. అందరూ  నిశ్చయించి వారికి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇక పెళ్లి కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అంతలో ప్రకృతి పగబట్టింది వర్షాలతో ఎక్కడికక్కడ వరద నీరు నిండి పోయాయి. ఇలాంటి సమయంలో కూడా వారు పెళ్లి మాత్రం ఎక్కడా వాయిదా వేసుకోవడానికి సిద్ధపడలేదు.  చివరికి అష్టకష్టాలు పడి పెళ్లి చేసుకున్నారు.

 ఈ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. కేరళలో భారీ వర్షాలు ఉండడంతో వరద నీరు ఎక్కడికక్కడ నిండిపోయాయి. ఈ క్రమంలోనే ఈ వరదల నడుమ ఓ జంట పెళ్లి చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలప్పుజ జిల్లా కు చెందిన ఆకాశ్, ఐశ్వర్య అక్టోబర్ 5వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం  గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ భారీ వర్షాలతో వీధులన్ని వరద నీటితో నిండిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఒక పెద్ద వంటపాత్రలో వివాహ వేదిక వద్దకు వధూవరులు చేరుకున్నారు ఇక అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: