ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు ATM కి వెళ్లి డ్రా చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా తృప్తిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్రా చేసుకున్న డబ్బులు చూడగానే ఏదో తెలియని ఆనందం అనేది వస్తుంది.ఇక ముఖ్యంగా మీకు జీతం వచ్చిన తర్వాత డబ్బులు డ్రా చేసుకుంటున్నప్పుడు వచ్చే ఆ ఆనందంలో వచ్చే కిక్కే వేరు. సరిగ్గా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక అమ్మాయి ATM నుండి డబ్బులు డ్రా చేసుకుంటున్న వీడియో ఇప్పుడు నెటిజనులను తెగ నవ్విస్తుంది. ఇక డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏటీఎమ్ లోపల చాలా ఫన్నీగా సంతోషంగా డ్యాన్స్ చేయడం అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో దెబ్బకి వైరల్ అయింది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినప్పటి నుండి లక్షల వ్యూస్ అందుకుంటుంది. ఆ అమ్మాయి ఆనందంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోని ‘ఘంటా’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. "ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి" అనే క్యాప్షన్‌తో పాటు వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో అప్‌లోడ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది,దీన్ని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఇక ఈ వీడియోలో ఆ అమ్మాయి బ్లాక్ టాప్ మరియు బ్లాక్ ఫేస్ మాస్క్ వేసుకొని వుంది. అమ్మాయి ATM బూత్ లోపల నిలబడి, క్రేజీగా డాన్స్ చేస్తూ కొంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆమె ATM మెషిన్ లో తన కార్డు పెట్టి డబ్బులు తీస్తూ ఆమె కొన్ని ఫన్నీ స్టెప్పులను వెయ్యడం అక్కడున్న కెమెరాలో రికార్డు అయ్యింది.మెషిన్ లో నుంచి వచ్చిన డబ్బుని చూసినప్పుడు, ఆ అమ్మాయి సంతోషంగా ఇంకా అలాగే మరింత ఉత్సాహభరితమైన డాన్స్ చెయ్యడాన్ని చూడవచ్చు. వీడియో చివరలో, ఆమె డబ్బులు తీసుకున్న తర్వాత, ఆమె ATM మెషీన్‌కు నమస్కరించి, చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతోంది. ATM బూత్ లోపల ఆమె ఆశువుగా నృత్య ప్రదర్శనకు కారణం ఇంకా తెలియకపోయినప్పటికీ, నెటిజన్లు దానిని చూసి వివిధ రకాలుగా చూసి ఫన్నీగా కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో కేవలం ఒక రోజు క్రితం అప్‌లోడ్ చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 28 లక్షల మందికి పైగా చూశారు.మూడు లక్షల మంది లైక్ చేశారు. ఇక ఈ కింద వున్న ఇంస్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి మీరు చూసేయండి.https://www.instagram.com/p/CUeyRiosvN-/?utm_medium=copy_link
Your browser does not support HTML5 video.