వెలగ పండు లాభాలు వింటే అదరహో అనాల్సిందే..!

Divya
ఈ సీజన్లో దొరికే వెలగపండు అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.. వెలగ పండు కేవలం మనుషులకు మాత్రమే కాదు బొజ్జగణపయ్యకు కూడా మహాప్రీతి.. బొజ్జ గణపయ్య పండుగ ఈ కాలం లోనే వస్తుంది కాబట్టి ఈ వెలగ పండ్లు కూడా ఈ కాలం లోనే పండుతూ ఉంటాయి. ఈ వెలగపండు చాలామంది మగ్గిన తరువాత లోపల గుజ్జులో కొద్దిగా బెల్లం కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక వెలగ పండు వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. అదేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

వెలగ పండు.. కాయ గా ఉన్నప్పుడు పులుపు, వగరు కలిపిన రుచితో మనకు లభిస్తుంది..అదే పూర్తిగా పండిన తర్వాత పులుపు, తీపి సువాసనతో తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఈ కాలంలో దొరికే ఈ వెలగపండు తినడానికి కొంచెం వగరుగా ఉన్నప్పటికీ , ప్రతి ఒక్కరు తప్పకుండా తిని తీరాల్సిందే.. ఈ వెలగపండులో పిండి పదార్థాలూ,   థయామిన్ , రిబోఫ్లోవిన్ , నియాసిస్ , కాల్షియం, బీటా కెరోటిన్ ,ఫాస్పరస్ ,ఆక్సాలిక్ , ఐరన్ ,  ప్రొటీన్లు, మాలిక్ , సిట్రిక్ అమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి కూడా సమృద్ధిగా  లభిస్తాయి.. అంతేకాదు  ఈ పండు తినడం వల్ల 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి మన శరీరానికి లభిస్తుంది.

వెలగ పండు లో లభించే యాంటీఆక్సిడెంట్స్ కారణంగా వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవు. ఇక ఈ వెలగపండు లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. వెలగ పండు తినడం వల్ల గజ్జి, తామర, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. వెలగపండు లో ఫైబర్ సమృద్ధిగా లభించడం వల్ల మలబద్దక సమస్య కూడా దూరం చేసుకోవచ్చు. వెలగ పండు చెట్టు యొక్క పేర్లను కూడా ఉపయోగించి ఇంట్లో దోమలు రాకుండా చేయవచ్చు.
బిడ్డలకు పాలిచ్చే తల్లులు, శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్లు, గర్భవతులు వెలగ పండు ను తినకుండా ఉంటేనే మంచిది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: